Begin typing your search above and press return to search.
వైఎస్సార్ బాబుకు ప్రాణ స్నేహితుడు కానే కాదట...?
By: Tupaki Desk | 23 Oct 2022 7:11 AM GMTవైఎస్సార్ దివంగతులై 13 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆయన పేరు తెలుగు రాజకీయాల్లో మారుమోగుతూనే ఉంది. ఆయన పేరిట పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కూడా కుమారుడు జగన్ అయ్యారు. దాంతో వైఎస్సార్ పేరిట పధకాలు కూడా అనేకం పెట్టి ఆయనని జనాలు నిత్యం తలచుకునేలా చేస్తున్నారు. ఒక విధంగా వైఎస్సార్ మీద పేటెంట్ హక్కులు అన్నీ రాజకీయంగా చూస్తే వైసీపీకే ఉన్నాయి. కానీ సడెన్ గా ఈ మధ్యన ఆయన పేరుని టీడీపీ నేతలు ఎక్కువగా తలుస్తున్నారు.
చంద్రబాబు అయితే ఆ మధ్య అసెంబ్లీలో వైఎస్సార్ తానూ ఒకే రూం ఒక మంచం అన్నట్లుగా మాట్లాడారు, తనకు వైఎస్సార్ మంచి స్నేహితుడు అని కూడా చెప్పుకున్నారు. ఇక జగన్ మీద విమర్శలు చేసేటపుడు కూడా వైఎస్సార్ మంచివారు అనే మాట్లాడుతూ వస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కూడా వైఎస్సార్ మంచివారు అని ఇపుడు కొత్త పాట పాడుతున్నారు. ఇదంతా ఎందుకు అంటే వైఎస్సార్ ని రాజకీయంగా ఎంతో కొంత తామూ వాడుకోవాలన్న ఉద్దేశ్యమని విశ్లేషణలు ఉన్నాయి.
ఇవనీ పక్కన పెడితే పరాకాష్టగా చందబాబు ఓటీటీ ఫ్లాట్ వారం మీద వస్తున్న బాలక్రిష్ణ రియాల్టీ షో అన్ స్టాపబుల్ లో మాట్లాడుతూ తనకు బెస్ట్ ఫ్రండ్ వైఎస్సార్ అని చెప్పుకున్నారు. ఆయనతో కలసి తాను బాగా గడిపాను అని తొలి రోజు రాజకీయాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఇది పూర్తిగా తప్పు అని అంటున్నారు. 1978లోనే బాబు వైఎస్సార్ లతో పాటుగా తొలిసారి ఎమ్మెల్యే అయిన గోనే ప్రకాశరావు. ఆయన వైఎస్సార్ కి ఆత్మీయుడు కూడా.
తాజాగా ఒక యూట్యూబ్ చానల్ లో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఫ్రండ్స్ బ్యాచ్ వేరు చంద్రబాబు ఫ్రండ్స్ బ్యాచ్ వేరు అంటూ ఆనాటి ముచ్చట్లు వివరించారు. 1978లో చంద్రబాబు కాంగ్రెస్ ఐ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారని, అలాగే రెడ్డి కాంగ్రెస్ తరఫున వైఎస్సార్ పులివెందుల నుంచి గెలిచారు అని చెప్పారు. అంతకు ముందు కడప జిల్లా కాంగ్రెస్ కి వైఎస్సార్ ప్రధాన కార్యదర్శిగా ఉంటే చంద్రగిరిలోని ఒక బ్లాక్ కి యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బాబు ఉండేవారు అని పేర్కొన్నారు.
1978లో చంద్రబాబు ఎమ్మెల్యేల్ ఫ్రండ్స్ గా శ్రీ కాళహస్తి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఉన్నం సుబ్రహ్మణ్య నాయుడు, అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అద్దంకి నుంచి గెలిచిన కరణం బలరామ క్రిష్ణమూర్తి బాబు ఫ్రండ్స్ అని గోనే చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురూ కలసి తిరిగేవారు అని వెల్లడించారు. ఇక వైఎస్సార్ ఫ్రండ్స్ అంతా కడప జిల్లాకు చెందిన వారు ఉండేవారు అని. వారిలో ఇండిపెండెంట్ గా గెలిచిన డీఎల్ రవీంద్రారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే పాలకొండరాయుడు వంటి వారితోనే వైఎస్సార్ ఎక్కువగా తిరిగేవారు అని చెప్పారు.
1978లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సీఎం గా మర్రి చెన్నారెడ్డి అయ్యారని ఆ మంత్రివర్గంలో వైఎస్సార్ కి చంద్రబాబుకు మంత్రి పదవులు దక్కలేదని అన్నారు. 1980 అక్టోబర్ లో ఏర్పాడిన అంజయ్య మంత్రివర్గంలో వైఎస్సార్ మంత్రి పదవి దక్కించుకున్నారని, తనతో పాటుగా చంద్రబాబు మంత్రి పదవి కోసం ఆయన తనకు చేతనైన సాయం చేశారని అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని అన్నారు. అదే విధంగా భవనం వెంకటరాం, తదితర మంత్రివర్గాలలో కూడా ఇద్దరూ పనిచేశారని పేర్కొన్నారు.
ఇక ఆ రోజుల్లో వైఎస్సార్ కీలకమైన నేతగా ఉండేవారని గుర్తు చేశారు.1983లో వైఎస్సార్ పీసీసీ చీఫ్ అయ్యారని, ఆయన ఆ పదవిలో ఉండగానే చంద్రబాబు 1984లో కాంగ్రెస్ ని వీడి టీడీపీలోకి వెళ్లిపోయారని, అలా కేవలం కొద్ది ఏళ్ళు మాత్రమే ఇద్దైర్ మధ్య స్నేహం ఉందని అన్నారు. ఇక టీడీపీలోకి బాబు వెళ్లాక ఇద్దరి మధ్య గ్యాప్ బాగా ఎక్కువ అయిందని అన్నారు.
ఇక వైఎస్సార్ తనకు మంచి స్నేహితుడు అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు కానీ ఆయన హైదరాబాద్ లో కొన్న ఒక స్థలం విషయంలో హై కోర్టు సుప్రీం కోర్టు వైఎస్సార్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చినా కూడా కక్ష్తతో ఆయన స్థలం విషయంలో ఇబ్బందులు పెట్టారని గోనే పాత విషయాన్ని గుర్తు చేశారు. మరి తనకు మంచి స్నేహితుడు అయితే ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ 1996లో ఎంపీగా కడప నుంచి పోటీ చేస్తే పులివెందులలో ఒక ఎస్పీని పోలింగ్ రోజంగా ఉంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను పెట్టి మరీ ఆయనను ఓడగొట్టాలని బాబు సీఎం గా ఉన్నపుడు చేశారని మరో ఉదంతం చెప్పారు.
అయితే వైఎస్సార్ మాత్రం సీఎం అయ్యాక బాబు కుప్పం జోలికి పోలేదని, ఆయనే కనుక ఇపుడు జగన్ మాదిరిగా కుప్పం విషయంలో పట్టు బిగిస్తే 2009 ఎన్నికల్లఒనే బాబు ఓడి ఉండేవారు అని కూడా అంటున్నారు. ఇక వైఎస్సార్ పేరును పదే పదే బాబు తలవడం వెనక ఫక్తు రాజకీయం ఉందని, తనకు మంచి దోస్త్ తండ్రి అని ఆయనకు ఉన్న మంచి లక్షణాలు కొడుకు జగన్ కి లేవని వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయడానికే ఇదత్నా బాబు చేస్తున్నారని అన్నారు.
ఇలా బాబు ఆయన ఏమి మాట్లాడినా అందులో రాజకీయ ఆలోచనలు ముందు చూపే ఉంటాయని గోనే అభిప్రాయపడ్డారు. అంటే జస్ట్ రెండేళ్ల స్నేహం మాత్రమే బాబు వైఎస్సార్ ల మధ్య నడిచింది అనుకోవాలి. అది కూడా ప్రాణ స్నేహం కాదని ఆనాటి వారి సహచరుడు గోనె అంటున్నదాని బట్టి చూస్తే అనుకోవాలేమో.