Begin typing your search above and press return to search.
వొడాఫోన్ కు హ్యాపీ న్యూస్.. రూ.22వేల కోట్లు కట్టనక్కర్లేదా?
By: Tupaki Desk | 26 Sep 2020 7:15 AM GMTకారణం ఏదైతే కానీ.. భారీ పన్ను చిక్కుల్లో చిక్కుకొని కిందా మీదా పడుతున్న బ్రిటన్ కమ్యునికేషన్ల సంస్థ వొడాఫోన్ కు భారీ ఊరట లభించింది. గతంలో బకాయిలు ఉన్న పన్ను చెల్లింపుల కింద దగ్గర దగ్గర రూ.22వేల కోట్లను భారత సర్కారుకు కట్టాల్సి ఉందంటూ నోటీసులు జారీ చేయటం తెలిసిందే. అంత భారీ మొత్తాన్ని పన్నుల రూపంలో చెల్లించాలని కోరటం అన్యాయమని ఆ సంస్థ వాదిస్తోంది.
తన వాదనలను అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించిన ఆ సంస్థకు భారీ ఊరటనిచ్చేలా అక్కడి కోర్టు తీర్పును ఇచ్చింది. భారత ప్రభుత్వం పేర్కొన్నట్లుగా రూ.22,100 కోట్ల మొత్తాన్ని వొడాఫోన్ చెల్లించాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం జారీ చేసిన పన్ను నోటీసులు ఉల్లంఘనకు పాల్పడినట్లుగా పేర్కొంది.
దీనిపై భారత అధికారులు ఆచితూచి అన్నట్లుగా స్పందిస్తున్నారు. తాము పత్రాల్ని పరిశీలిస్తున్నామని.. తొందరపడి దీనిపై స్పందించమని స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు భారత్ కట్టుబడి ఉంటుందా? లేదా? అన్నది తేలాల్సి రావొచ్చు.
ఇదిలా ఉంటే.. వ్యయాల రిఫండ్ ల విషయంలో దాదాపుగా రూ.75 కోట్ల వరకు వొడాఫోన్ కట్టే వీలుందంటున్నారు. అదే జరిగితే.. 22వేల కోట్ల భారం స్థానంలో రూ.75కోట్లు పెద్ద విషయం కాదంటున్నారు. అంతర్జాతీయ ట్రైబ్యునల్ పేర్కొన్నట్లుగా ఫైన్ కట్టాల్సిన అవసరం వొడాఫోన్ కు లేకుంటే.. ఈ సంస్థకు అంతకు మించిన సంతోషకరమైన విషయం మరొకటికి ఉండదని చెప్పాలి.