Begin typing your search above and press return to search.

పాక్ జెండా...బెస్ట్ టాయిలెట్ పేప‌ర్‌

By:  Tupaki Desk   |   17 Feb 2019 3:47 AM GMT
పాక్ జెండా...బెస్ట్ టాయిలెట్ పేప‌ర్‌
X
పుల్వామాలో ఉగ్రదాడి జరిగి భారత్‌ కు చెందిన 44మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో ఉగ్రవాదులపైనా, వారిని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ పైనా ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ ఆగ్ర‌హం సోష‌ల్ మీడియాలో పాక్‌ పై చూపుతోంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ట్విట్టర్, ఫేస్‌ బుక్ తదితర వాటిలో పాక్ జెండాతో ‘బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద వరల్డ్’ హ్యాష్‌ ట్యాగ్‌ తో హోరెత్తిపోతోంది.

ఈ నేప‌థ్యంలో, ప్రపంచంలోనే 'బెస్ట్ టాయిలెట్ పేపర్' ఏది అని గూగుల్‌ లో వెతికితే ఈ ప్రశ్న అడగానే పాకిస్థాన్ జెండా దర్శనమిస్తుంది. గూగుల్ ఇలా సంబంధం లేని ఫొటోలను చూపించడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది ‘ఇడియట్’ అన్న పదానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోను చూపించిన విషయం తెలిసిందే.

ఇదిలాఉండ‌గా, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ పై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఆ దేశానికి కల్పిస్తున్న అత్యంత ప్రాధాన్య దేశం (మోస్ట్ ఫేవర్డ్ నేషన్-ఎంఎఫ్‌ ఎన్) హోదాను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. శుక్రవారం భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఎమ్‌ ఎఫ్‌ ఎన్ హోదా ఉపసంహరణ ద్వారా కస్టమ్స్ చట్టం, విదేశీ వాణిజ్య(అభివృద్ధి, నియంత్రణ) చట్టాల కింద పాక్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.1996లో పాక్‌ కు భారత్ ఎమ్‌ ఎఫ్‌ ఎన్ హోదా కల్పించింది. అయితే పాక్ మాత్రం భారత్‌ కు ఆ హోదా ఇవ్వలేదు.