Begin typing your search above and press return to search.

గూగుల్ స్మార్ట్ వాచ్ లు.. అమెరికాలో అలా జరుగుతున్నాయట

By:  Tupaki Desk   |   2 May 2022 3:28 AM GMT
గూగుల్ స్మార్ట్ వాచ్ లు.. అమెరికాలో అలా జరుగుతున్నాయట
X
ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ అన్నది మనిషి జీవితంలో భాగమైంది. వేరే దేశాల విషయాన్ని పక్కన పెడితే.. మన దేశంలో తిరుగులేని సెర్చింజన్ గా గూగుల్ అవతరించింది. ఆ మాటకు వస్తే.. ఈ సంస్థ ప్రభావం కోట్లాది మంది భారతీయులమీద ఎంతో ఉంది. నమ్మకమైన బ్రాండ్ గా కూడా పేరును సొంతం చేసుకుంది.

అలాంటి గూగులమ్మకు తాజాగా అమెరికాలో భారీ షాక్ తగిలింది. ఈ సంస్థకు చెందిన స్మార్ట్ వాచ్ లు ధరించటం వల్ల తమ చేతులు కాలిపోయినట్లుగా ఆరోపిస్తూ ఇద్దరు మహిళలు అమెరికాలోని జిల్లా కోర్టుల్లో కేసులు వేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్త సందేహాలకు తెర తీసేలా మారింది.

ఉత్తర కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో ఇద్దరు మహిళలు (జెన్నీ హౌచెన్స్, సమంతా రామిరేజ్) కేసు వేశారు.తాము గూగుల్ కు చెందిన ఫిట్ బిట్ స్మార్ట్ వాచ్ వెర్సాలైట్ మోడల్ ను ధరించినట్లుగా పేర్కొన్నారు. ఈ వాచ్ లు ధరించిన తమ కుమార్తె చేయి కాలినట్లుగా జెన్సీ హౌచెన్స్ వాపోతే.. ఈ వాచ్ కారణంగా తాను గాయపడినట్లుగా సమంతా రామిరేజ్ ఆరోపించారు. తమకు వాచ్ కొన్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేయటంతో పాటు.. చట్టపరమైన ఖర్చు కూడా ఇవ్వాలని వారు కోర్టును కోరుతున్నారు.

ఫిట్ బిట్ పేరుతో గూగుల్ సంస్థ తమ స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. 2018 ఏప్రిల్ లో ఫిట్ బిట్ వెర్సాను లాంఛ్ చేసి మార్కెట్లోకి వచ్చింది. 2019 సెప్టెంబరులో ఫిట్ బిట్ వెర్సా ను తీసుకురాగా.. 2020 సెప్టెంబరులో ఫిట్ బిట్ వెర్సా 3ను విడుదల చేసింది. గూగుల్ నుంచి విడుదలైన ఈ వాచ్ లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపారు. అయితే.. ఈ వాచ్ ల్ని వినియోగిస్తున్న వారి చేతులు కాలిపోతున్నట్లుగా ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి.

వాచ్ లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు హీటెక్కి పేలిపోతున్నాయని పలువురు మండిపడుతున్నారు. దీంతో.. గత ఏడాది మార్చిలో నాసిరంగా ఉన్న 10 మిలియన్లు (దాదాపు కోటికి పైనే) ఫిట్ బిట్ వాచ్ లను వెంటనే రీకాల్ చేయాలని గూగుల్ను కన్జ్యూమర్ సేఫ్టీ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో స్పందించిన గూగుల్ తమ వాచ్ లను రీకాల్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.

తాము వాచ్ లను కొన్నది కేలరీలు బర్న్ చేసుకోవటానికి స్మార్ట్ వాచ్ లు కొనుగోలు చేస్తారే తప్పించి చేతులు కాల్చుకోవటానికి కాదంటూ ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని కోర్టులో వినిపిస్తున్నారు. మరి.. కోర్టు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.