Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు కౌంటర్.. వైజాగ్ లో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు
By: Tupaki Desk | 23 Jun 2023 6:00 PMతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో యాభై ఎకరాలు కొనొచ్చంటూ చేసిన వ్యాఖ్యలకు బలమైన రిటార్టు ఇచ్చారు. తెలంగాణలో డెవలప్ మెంట్ ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని చెబుతూ.. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏపీలో భూముల ధరలపై సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో తనకు తెలీదని.. తాజాగా చూసిన వీడియోలో హైదరాబాద్ లో ఎకరం అమ్మితే యాభై ఎకరాలు ఏపీలో కొనొచ్చని వ్యాఖ్యానించారని.. తాను అదే చెబుతున్నానని.. వైజాగ్ లో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చన్నారు. తెలంగాణ అంటే హైదరాబాద్ అనుకోకూడదని.. అది కాకుండా విడిగా చాలా ప్రాంతం ఉందన్న గుడివాడ.. హైదరాబాద్ కు బయటకు వెళితే ఆ ధరలు మరెక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.
హైదరాబాద్ లో పోల్చుకోవాలంటే వైజాగ్ లో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాల భూమిని కొనొచ్చని చెబుతూ.. 'తెలంగాణ గురించి పక్కన పెడదాం. హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నా. హైదరాబాద్ లో లేనట్టి రేట్లు ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నాయి. ఆ డిమాండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
ఎక్కడో తెలంగాణలోని హైదరాబాద్ ను పట్టుకొని.. తెలంగాణ అంతా ఏదో జరిగిపోతుందన్న ఫీలింగ్.. పాపం ఆ ప్రజల్లో ఏ రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారో తెలీదు కానీ.. ఆయన ఏదైతే ఎకరం అమ్మితే యాభై ఎకరాలు అన్నారో.. నేను కూడా సమాధానం చెబుతా ఉన్నా. ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చన్నది మా వాదన'' అని వ్యాఖ్యానించారు.
ఆ రేట్లు విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ మా నర్సీపట్నంలో కానీ అదే రేట్లు ఉన్నాయంటూ.. ''ఇంకో దగ్గర కూడా అదే రేట్లు ఉన్నాయి. ఏదో ఒక మాట చెప్పేసి.. అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పారు. ఇంకెవరైనా చెప్పారని చెబితే బాగుండేది. ఆయన స్నేహితుడు ఎవరో చెప్పారని చెప్పినా బాగుండేది కేసీఆర్ కు. చంద్రబాబు చెప్పింది చెబితే ఎవరైనా నమ్ముతారా?'' అని ప్రశ్నించారు.
మీ ప్రాంత రాజకీయాల కోసం పక్క రాష్ట్రాలను , ప్రభుత్వాలను కించపర్చటం సమంజసం కాదని హితవులు పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ ఆధారాల సహితంగా కౌంటర్ ఇచ్చారన్న మాట వినిపిస్తోంది.