Begin typing your search above and press return to search.

ఓయో వ్యవస్థాపకుడి పెళ్లి.. సీన్ మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   6 March 2023 11:00 AM GMT
ఓయో వ్యవస్థాపకుడి పెళ్లి.. సీన్ మామూలుగా లేదుగా?
X
దేశీయ హాస్పిటాలిటీ రంగాన్ని సమూలంగా మార్చేయటమే కాదు.. సరికొత్తగా ఆవిష్కరించిన ఘనత ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ కు దక్కుతుంది. తన బ్రాండ్ ను హోటల్ ఇండస్ట్రీకి మారు పేరుగా మార్చిన అతగాడి పుణ్యమా అని.. దేశ వ్యాప్తంగా ఏ మూలకు వెళ్లినా.. సేవలు అందుతున్న పరిస్థితి.

యువకుడిగా సంచలన విజయాన్ని అందుకున్న అతడు తాజాగా ఒక ఇంటివాడు అవుతున్నాడు. మరో రోజులో అతగాడి వివాహం దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో జరుగుతోంది.

ఇతగాడి రేంజ్ ఎంతంటే.. తన కాబోయే భార్యను వెంటపెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి.. ఆయనకు తమ వెడ్డింగ్ కార్డు ఇచ్చి.. తమ పెళ్లికి రావాల్సిందిగా ఆయన్ను కోరారు.

అంతేనా.. రితేశ్ పెళ్లికి ఆహ్వానించిన ప్రముఖుల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఎయిర్ బీఎన్బీ.. లైట్ స్పీడ్ కామర్స్ సంస్థల అధినేతలతో పాటు సాఫ్ట్ బ్యాంక్ ఛైర్మన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సాఫ్ట్ బ్యాంక్ ఛైర్మన్ ఏంది? రితేశ్ పెళ్లికి రావటమా? అంటూ దానికో కారణం లేకపోలేదు. ఓయోలో అత్యధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారిలో జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ ఒకటి.

ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్ మసయోషి సన్ కూడా పెళ్లికి హాజరువుతున్నట్లుగా చెబుతున్నారు. పెళ్లి పిలుపుల్లోనే రితేశ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. మరి.. ఆయన పెళ్లి వేడుక మరింత చర్చ ఖాయమన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.