Begin typing your search above and press return to search.
ఏ పార్టీలో లేనిది కాంగ్రెస్ లోనే ఎందుకు అజాద్?
By: Tupaki Desk | 28 Aug 2020 9:10 AM GMTకాంగ్రెస్ పార్టీని ఎవరో దెబ్బ తీయాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలోని వారే ఆ పని చేస్తారంటూ రాజకీయ వర్గాలు అప్పుడప్పుడు వ్యాఖ్యానిస్తుంటాయి. తాజాగా చోటుచేసుకుంటున్నపరిణామం చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఇప్పటివరకు అనుమానాలు ఉన్న వారందరికి క్లారిటీ వచ్చేసే పరిస్థితి. మొన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్లపై విరుచుకుపడిన రాహుల్ గాంధీకి తగిన రీతిలో సమాధానం చెప్పేలా సీనియర్ నేతలంతా ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది.
గడిచిన కొన్నేళ్లుగా దేశంలోని ఏ రాజకీయ పార్టీ అనుసరించిన కొత్త థియరీని తెర మీదకు తీసుకొచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే.. రాహుల్ మీద ఆయనకున్న కోపం ఇంకా తగ్గలేదన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. తమపై మాటలు రువ్విన రాహుల్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆయన తాజా వ్యాఖ్యలున్నాయి.
పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగాలని.. ఎన్నికల ద్వారానే కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. నేరుగా పార్టీ అధినేతను ఎంపిక చేసుకోవటం ద్వారా పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న ఆయన.. నేరుగా ఎంపికైన అధ్యక్షులకు పార్టీలో ఒక శాతం మంది మద్దతు కూడా ఉండకపోవచ్చన్నారు.
అదే సమయంలో ఎన్నికల ద్వారా ఎంపికయ్యే అధ్యక్షుడికి 51 శాతం మద్దతు ఉంటుందన్న ఆయన.. ‘‘ఓట్ల ద్వారా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోకపోతే మరో యాభై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుంది. సంస్థాగత ఎన్నికల ద్వారానే పార్టీ పునాదులు బలపడతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గులాం చేసిన వ్యాఖ్యలు దేశంలోని ఏ రాజకీయ పార్టీ అనుసరించనివిగా ఉండటం గమనార్హం.
అజాద్ చెప్పిన మాటల్నే ప్రాతిపదికగా తీసుకుంటే.. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అధినేతలుగా ఉన్న గాంధీ కుటుంబానికి ఒక శాతం మంది మద్దతు కూడా లేనట్లా? అన్న సందేహం రాక మానదు. తన మాటలతో రాహుల్ కు కౌంటర్ ఇవ్వాలన్న ఆలోచన తప్పించి.. పార్టీకి జరిగే నష్టం గురించి ఆయన పెద్దగా పట్టనట్లుగా ఉందని చెప్పక తప్పదు.