Begin typing your search above and press return to search.

బాబును అందరూ ఆడేసుకుంటున్నారు..

By:  Tupaki Desk   |   8 May 2019 10:35 AM GMT
బాబును అందరూ ఆడేసుకుంటున్నారు..
X
ఉద్యోగం లేని పురుషుడిని.. పదవిలో లేని రాజకీయ నాయకుడిని ఎవరూ పట్టించుకోరనేది నానుడి. ఏపీలోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న బాబుకు అధికారాలు లేవు. అందుకే చంద్రబాబు పరిస్థితి ఉత్సవ విగ్రహం లానే ఉంది. ఒక వైపు ఈసీ.. మరోవైపు సీఎస్.. చంద్రబాబు నిర్ణయాలను అమలు చేయడంలేదు. ఆయనను పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. బాబుతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఇప్పుడు వారి బాటలోకి గవర్నర్ నరసింహన్ కూడా వచ్చి చేరాడు.

ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న రోజులవి. ఆయన కొందరు సన్నిహితులకు లాభం చేకూర్చేందుకు వారిని సమాచార కమిషనర్లుగా నియమిస్తూ అర్హతలేని వారి పేర్లను పంపారు. కానీ గవర్నర్ అప్పట్లో అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే రీతిలో అనర్హులైన వారిని సమాచార కమిషనర్లుగా పంపాలిని ఇద్దరి పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ మోకాలడ్డారు...దీంతో బాబు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయారు.

విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఐలాపురం రాజా.. రెవెన్యూ సర్వీసులో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐ శ్రీరామమూర్తి పేర్లను చంద్రబాబు ప్రతిపాదించారు. వీరిద్దరూ సమాచార కమిషనర్లుగా బాబు ఫైల్ పంపారు.కానీ వీరిద్దరికి సమాచార కమిషనర్లుగా అర్హత ఏమాత్రం లేదని గవర్నర్ తేల్చారు. శ్రీరామమూర్తి సామాజిక సేవ ఏంటో చెప్పాలని బాబును గవర్నర్ వివరణ అడిగారు. దీంతో నొచ్చుకున్న బాబు ఏకంగా స్వయంగా వెళ్లి గవర్నర్ పై ఒత్తిడి తెచ్చారట.. అయినా ఒకరి పేరుకు ఆమోదం తెలిపిన గవర్నర్ మరో పేరును మాత్రం పెండింగ్ లో పెట్టారు..

ఇలా చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ గవర్నర్ మనసును మాత్రం కరిగించలేకపోయారు. అయినా అలిగేషన్స్ ఉన్న వారిని సమాచార కమిషనర్లుగా ప్రతిపాదించడం బాబు చేసిన తప్పు. అర్హులను ఎంపిక చేస్తే గవర్నర్ అభ్యంతర పెట్టేవారు కాదు.. బాబు చేస్తున్న తప్పులను గవర్నర్ కూడా చేయాలంటే కుదరదు కదా.. అందుకే ఈ అవాంతరాలు..