Begin typing your search above and press return to search.

విశాఖను భయపెడుతున్న H3N2.. మళ్లీ మాస్క్ తప్పనిసరి

By:  Tupaki Desk   |   10 March 2023 11:10 AM
విశాఖను భయపెడుతున్న H3N2.. మళ్లీ మాస్క్ తప్పనిసరి
X
ప్రపంచ వ్యాప్తంగా పోస్ట్ కోవిడ్ లక్షణాల కారణంగా కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోసారి కోవిడ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్‌ కారణంగా హఠాత్తుగా గుండె పోటుకు గురవుతున్న వారు ఎక్కువ అయ్యారు. ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుండె పోటు కేసులు ఎక్కువ అయ్యాయి.

ఈ సమయంలోనే విశాఖపట్నంలో కొత్త వైరస్ ఆందోళన కలిగిస్తోంది. దగ్గు.. జలుబుతో బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. సాధారణంగా జలుబు.. దగ్గు రెండు మూడు రోజులు మహా అయితే వారం రోజుల్లో తగ్గుతాయి. కానీ రెండు వారాలైన కూడా ఈ కొత్త వైరస్ వల్ల వస్తున్న జలుబు.. దగ్గు తగ్గడం లేదు.

దేశవ్యాప్తంగా H3N2 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైజాగ్ లో కూడా అదే ప్రభావం అయ్యి ఉంటుందని ఆరోగ్య శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. శ్వాసకోశ సమస్యలు రావడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా ప్రతి నలుగురిలో ఇద్దరు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముందు ముందు పరిస్థితులు మరింత సీరియస్ గా అయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

గత రెండు వారాలుగా ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఒకే తరహా సమస్యలు ఉండటంతో ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి చర్యలు ప్రారంభించినట్లుగా ప్రకటించారు.

ప్రతి ఒక్కరు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించడంతో పాటు ఇంట్లో ఉన్న సమయంలో కూడా తోటి వారికి కాస్త దూరంగా ఉండాలని.. చిన్న అనారోగ్య సమస్యలు అనిపించినా కూడా జాగ్రత్తగా ఉండి వెంటనే చికిత్స అందుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో వైజాగ్ లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇంటింటి సర్వేకు వార్డు వాలంటీర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా కావాల్సినన్ని మందులను అందుబాటులో ఉంచినట్లుగా పేర్కొన్నారు. విశాఖ తో పాటు ముందు ముందు దేశ వ్యాప్తంగా ఈ కేసులు విస్తరించినా ఆశ్చర్యం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.