Begin typing your search above and press return to search.
550 మందికి తండ్రయ్యాడు.. ఇకనైనా ఈ వీర్యదానం ఆపురా బాబూ
By: Tupaki Desk | 4 May 2023 4:10 PM GMTఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 550 మందికి తండ్రి అయ్యాడు. వీర్యదానం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇంత మంది పిల్లలను కన్నాడు. ఇంకా ఇంకా వీర్యదానం చేస్తూనే ఉన్నాడు. చాలా ఆస్పత్రులకు ఐవీఎఫ్ సెంటర్లకు వీర్యాన్ని దానం చేస్తూనే ఉన్నాడు. దీంతో కోర్టుకు కోపం వచ్చింది. ఇక వీర్యదానం ఆపాలంటూ కోర్టు తీర్పునిచ్చింది.
ఒకవేళ కాదని వీర్యాన్ని దానం చేస్తే 88000 డాలర్లు మన కరెన్సీలో (రూ.72.16 లక్షలు జరిమానా) కట్టాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించింది. నెదర్లాండ్స్ కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి వీర్యదానాని కి ఎట్టకేల కు చెక్ పెట్టింది. ఏఏ ఆస్పత్రుల కు వీర్యాన్ని దానం చేశాడో ఆ జాబితాను ఇవ్వాలని కూడా కోర్టు జోనాథన్ ను ఆదేశించింది. ఆ ఆసుపత్రుల్లో నిల్వ ఉంచిన జోనాథన్ వీర్యాన్ని నాశనం చేయాలని కూడా తీర్పునిచ్చింది.
ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు 100మంది కంటే ఎక్కువమంది పిల్లల కు తండ్రి అయ్యాడని వార్తలు రావడంతో ఇక పై వీర్యాన్ని దానం చేయవద్దంటూ 2017లోనే నెదర్లాండ్ ఆదేశించింది. ఇప్పటివరకు నెదర్లాండ్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్ లలో వీర్యదానం చేశాడు.
ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. గరిష్ఠంగా 25 మంది చిన్నారుల కు మాత్రమే జన్మనివ్వాలి. భవిష్యత్‌లో రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు తలెత్తకుండా చూడటం, పుట్టిన సంతానం మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు రూపొందించారు.
జొనాథన్ వీర్యంతో తల్లి అయినట్లు చెబుతున్న ఒక మహిళ ఆయనకు వ్యతిరేకంగా కోర్టు కు వెళ్లింది. వీర్యదానం వల్ల పుట్టిన పిల్లలకు హక్కుల ను కాపాడే సంస్థ కూడా కోర్టులో దావా వేసింది. వీర్యదానం వల్ల పుట్టిన పిల్లలు శారీరకంగా కలిస్తే ఒకే జీన్స్ ఉండడం వల్ల వారి సంతానం నిలవదు. మానసికంగా ఎదగరు. మన దేశంలో మేనరికపు వివాహాల్లో ఎలాగైతే అంగవైకల్యం, మానిసిక వైకల్యంతో పుడుతారో ఇక్కడ కూడా అలానే జన్మిస్తారు.
సో కోర్టు ఇతడు 550 మందికి పైగా పిల్లల ను కనడాన్ని తప్పు పట్టింది. ఇక వీర్యదానం చేయకూడదని హుకూం జారీ చేసింది. వీర్యదానం వల్ల పుట్టిన పిల్లల సంఖ్య విషయంలో తల్లిదండ్రులను జొనాథన్ తప్పు దారి పట్టించాడు అని కోర్టు వ్యాఖ్యానించింది. డోనర్ అన్ని నిబంధనలను ఉల్లంఘించాడని, క్లినిక్ లతో చేసుకున్న ఒప్పందాలను బేఖాతరు చేశాడని దీంతో ఆయన వీర్యం ద్వారా జన్మించిన చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టు కు తెలిపారు.
దీంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. కొత్తగా ఎవరూ ఇతడి వీర్యం కోసం సంపద్రించవద్దని.. వీర్యదానం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ జొనాథన్ కూడా ప్రకటనలు ఇవ్వకూడదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.