Begin typing your search above and press return to search.
ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద .. బాబు ఇంటికి నోటీసు !
By: Tupaki Desk | 28 Sep 2020 9:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. భారీ వర్షాల దెబ్బకి వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండను తలపిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక గ్రామాలకు సంబంధాలు సైతం తెగిపోయాయి. వానలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. గంట గంటకి వరద తీవ్రత పెరిగిపోతుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇన్ ఫ్లో 6.66 లక్షలు క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కృష్ణా నది వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు ముంపుకి గురైయ్యాయి. కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. దీనితో విజయవాడ నగరంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి , ముంపు గ్రామాల వాసులని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా నది వరద 5 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో ఈ నోటీసులు జారీచేసినట్టు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. చంద్రబాబు ఇంటితో పాటూ కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు కూడా నోటీసులు ఇచ్చారు. వరద పెరుగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇళ్లల్లో ఎవరు ఉండొద్దు అని , సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలని చెప్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో చంద్రబాబు అద్దె ఇంట్లో ఉండటం తెలిసిందే. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లిపోయిన ఆయన..ఏదైనా పని నిమిత్తం వచ్చి , ఆ తరువాత మళ్లీ హైదరాబాద్ కి వెళ్లిపోతున్నారు. ఈ అద్దె నివాసంలో పెద్దగా ఉండటం లేదు.
గతేడాది కూడా భారీ వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరిగింది. అప్పుడు కూడా చంద్రబాబుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై అప్పట్లో రాజకీయంగా దుమారం రేగింది. ఉద్దేశపూర్వకంగానే ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసేసి వరద పెరిగేలా చేసి, చంద్రబాబు నివాసం ఉండే ఇల్లు మునిగేలా చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. తాజాగా మరోసారి చంద్రబాబు నివాసానికి నోటీసులు జారీచేయడంతో దీనిపై మరో వివాదం రాజుకునే అవకాశం లేకపోలేదు.