Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్​ తీసుకున్న ఆనందం.. డ్యాన్సులు కుమ్మేశారుగా..!

By:  Tupaki Desk   |   18 Dec 2020 4:34 AM GMT
వ్యాక్సిన్​ తీసుకున్న ఆనందం.. డ్యాన్సులు కుమ్మేశారుగా..!
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ రోగానికి మందులేక, వ్యాక్సిన్​ అందుబాటులోకి రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎట్టకేలకు వ్యాక్సిన్​ వచ్చేసింది. దీంతో ఇంతకాలం కరోనా అంటే వణికిపోయిన జనం వ్యాక్సిన్​ వచ్చేయడంతో వారికి ఊరట దక్కింది. దీంతో కొందరు కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న ఆనందంలో ఎగిరి గంతులేస్తున్నారు. డ్యాన్సులు చేస్తూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్​ చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్​ తీసుకున్న వెంబడే ఇష్టారాజ్యంగా తిరగొద్దని.. కొన్ని రోజులపాటు మాస్కులు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారిపై ప్రాణాలకు సైతం తెగించి పోరాడింది మాత్రం ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, వైద్య సిబ్బందే. అందుకే చాలా దేశాల్లో ముందుగా వాళ్లకే వ్యాక్సిన్​ ఇస్తున్నారు. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా కరోనాను కంట్రోల్ చేయడంలో పోరాడారు. అయితే తాజాగా బోస్టన్‌లోని ఓ మెడికల్ మెడికల్‌ సెంటర్‌ ఉద్యోగులు కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నారు. అనంతరం వారి ఆనందానికి పట్టాపగ్గాలు లేకుండా పోయాయి. ఎప్పడెప్పుడు కరోనాకు టీకా వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన వాళ్ళకు, వ్యాక్సిన్ రెడీ అయి వేసుకోవడం కూడా కంప్లీట్ కావడంతో వాళ్లు ఫ్లాష్‌ మాబ్‌ డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్​ ఇప్పుడు సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతున్నది.

ఇక్కడ డ్యాన్స్​చేసిన ఆరోగ్య కార్య‌క‌ర్త‌లంతా ఫేస్ మాస్క్‌లు, షీల్డ్స్ ధరించారు. అమెరికన్ గాయకుడు లిజ్జో హిట్ సాంగ్ 'గుడ్ యాజ్ హెల్' కు ఫ్లాష్‌ మాబ్‌ మాదిరిగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను కొందరు టిక్​టాక్​లో షేర్​ చేయడంతో విపరీతంగా వైరల్​ అయ్యింది. అనంతరం ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టా వంటి చోట కూడా వైరల్​గా మారింది.