Begin typing your search above and press return to search.

బిగ్ ట్విస్ట్ : దస్తగిరికి హై కోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   21 April 2023 4:33 AM IST
బిగ్ ట్విస్ట్ : దస్తగిరికి హై కోర్టు నోటీసులు
X
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైఎస్ వివేకా పీఏ క్రిష్ణారెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి వేసిన పిటిషన్ మీద విచారించిన హై కోర్టు ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న దస్తగిరికి నోటీసులు దాఖలు చేసింది.

ఆయన తరఫున కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోరింది. ఈ కేసులో హత్య చేసి నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారడానికి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు అయింది. పైగా ఆయన బెయిల్ మీద ఉండడం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని మీద తెలంగాణా హై కోర్టు విచారించింది దస్తగిరికి నోటీసులు ఇచ్చింది. కేసుని మూడు వారాల పాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే దస్తరిగి అప్రూవర్ గా మారిన తరువాత ప్రముఖుల పేర్లను బయటపెట్టాడు.

దీంతో పాటు రెండు సార్లు అతను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు. దాంతో ఈ కేసులో ఏ వన్ గా ఎర్ర గంగిరెడ్డి, ఏ టూ గా సునీల్ యాదవ్, ఏ త్రీ గా ఉమా శంకర్ రెడ్డి, ఏ ఫోర్ గా దస్తగిరి, ఏ ఫైవ్ గా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డిలను పేర్కొన్నారు.

తాజగా ఉదయ కుమార్ రెడ్డిని ఏ సిక్స్ గా చేర్చారు. లేటెస్ట్ అరెస్ట్ అయిన వైఎస్ భాస్కరరెడ్డిని ఏ సెవెన్ గా కేసులో పేర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆగింది. ఆయన ప్రతీ రోజూ సీబీఐ విచారణకు వస్తున్నారు. రెండవ రోజు అయితే ఏకంగా తొమ్మిది గంటల పాటు అవినాష్ రెడ్డిని విచారించారు

ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డి విచారణ నిరాటకంగా ఉంటుందని అంటున్నారు. రెండవ రోజు సంక్లిష్ట ప్రశ్నలు అడిగారని అన్నీ కూడా వివేకా హత్యకు సంబంధించినవిగానే అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడంతోనే మొత్తం కేసు వేగం పుంజుకుంది. దర్యాప్తు కూడా ఆ దిశగానే సాగుతోంది.

ఇంకో వైపు చూస్తే దస్తగిరి ఇపుడు సంచలనానికి మారు పేరు అయ్యాడు. దాంతో ఆయనకు ప్రాణభయం కూడా ఏర్పడింది. అందుకే తనకు భద్రత పెంచాలని కోరడంతో ఏపీ పోలీసులు భద్రత పెంచారు. ప్రస్తుతం దసగిరి ఇంటి ముందు పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు అయింది. దస్తగిరి ఈ కేసులో బెయిల్ మీద ఉంటూ పెద్ద వారి మీదనే విమర్శలు చేస్తున్నారు. దాంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా ఎలా తీసుకుంటారు అని పిటిషన్లు హై కోర్టులో పడ్డాయి. మరి దీని మీద దస్తగిరి ఏమి చెబుతారో కౌంటర్ ఎలా దాఖలు చేస్తారో చూడాల్సి ఉంది.