Begin typing your search above and press return to search.
2 నెలలు ఇంటర్నెట్ బ్యాన్.. మణిపూర్ సర్కారుకు హైకోర్టు షాక్
By: Tupaki Desk | 9 July 2023 10:52 AM GMTశాంతిభద్రతల సమస్య ఎదురైనంతనే ఇంటర్నెట్ ను నిలిపేసే ధోరణి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. గతంతో పోలిస్తే.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత కారణంగా సమాచార విప్లవం ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలే కానీ.. కోట్లాది మందికి సెకన్ల వ్యవధిలో ప్రపంచంలో ఏ మూలన ఉన్న సమాచారాన్ని అందించే వ్యవస్థలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే.. దీని కారణంగా మేలు ఎంతో.. కీడు అంతే అన్నట్లుగా పరిస్థితి ఉంది. అల్లర్లు.. హింస లాంటివి చోటు చేసుకున్నప్పుడు.. ఇంటర్నెట్ మీద నిషేధం విధించటం ఫర్లేదు కానీ.. దాన్నో పాలసీగా నెలల తరబడి కొనసాగించటమే అసలు సమస్య.
తాజాగా మణిపూర్ రాష్ట్ర ప్రజలు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. గిరిజనులు.. గిరిజనేతరుల మధ్య మొదలైన వర్గ పోరు.. భీకర హింసకు తెర తీయటం.. ఇప్పటికే పలువురుప్రాణాలు పోగొట్టుకున్న వరుస ఘటనలతో మణిపూర్ రగిలిపోతోంది. హింసతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ పై బ్యాన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయాన్ని రెండు నెలలుగా అమలు పర్చటంతో ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.
పర్వత ప్రాంతాల్లో నివసించే కుకీ తెగ.. లోయ ప్రాంతంలో నివసించే మొయితీస్ వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు మణిపూర్ ను యుద్ధ భూమిగా మార్చేశాయి. ఇరు వర్గాల మధ్య మొదలైన పోరుతో.. ఆ రాష్ట్రం రెండు నెలలుగా అట్టుడిగిపోతోంది. అయినప్పటికీ కేంద్రం ఈ సమస్య పరిష్కారానికి తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారే తప్పించి.. పరిష్కారాన్ని వెతకటంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. దేశంలో ఎక్కడైనా ఏదైనా జరిగినంతనే నిమిషాల వ్యవధిలో స్పందించిన ప్రధాని మోడీ.. మణిపూర్ ఇష్యూలో మాత్రం మౌనంగా ఉండటం కనిపిస్తుంది.
ఇలాంటి వేళ.. ఇంటర్నెట్ పై విధించిన బ్యాన్ ను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రానికి చెందిన కొందరు. దీనిపై వేడి వేడి వాదనలు జరిగాయి. తాజాగా మణిపూర్ లోని బీరెన్ సింగ్ సర్కారుకు ఆ రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసింది. రెండు నెలలుగా అమలు చేస్తున్న ఇంటర్నెట్ బ్యాన్ ను ఎత్తేయాలని చెప్పింది. మే 2న మొదలైన ఇంటర్నెట్ బ్యాన్.. నేటికి కొనసాగుతోంది. దీనిపై స్పందించిన హైకోర్టు.. ‘ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తేయాలి. కనీసం పాక్షికంగా అయినా బ్యాన్ ఎత్తేసి.. పరిమితంగా అయినా సేవలు అందించాలి’ అని ఆదేశాలు జారీ చేసింది.