Begin typing your search above and press return to search.
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నోడు
By: Tupaki Desk | 19 Jun 2016 6:48 AM GMTజీన్సు ప్యాంటు - టీషర్టు వేసుకుంటేనే హ్యాండ్సమ్ గా ఉంటామా? మగాళ్లు చీర కట్టుకుంటే తప్పేంటి అంటాడాయన.. అలా అని, ఆయన ఆ టైపు అనుకోవద్దు. చీర కేవలం ఆఢవాళ్ల వస్ర్తం కాదు - మగాళ్లూ దాన్ని కట్టుకోవచ్చన్న భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారు. అప్పుడప్పుడూ చీర కట్టుకుని చూడండి.. ఎంతందంగా ఉంటారో? అంటూ మగాళ్లనూ ఊరిస్తున్న ఈ ‘‘శారీ మేన్’’ పేరు హిమాంశు వర్మ. గత 12 ఏళ్లుగా చీర కట్టులో కనిపిస్తున్న హిమాంశు 2014 నుంచి ఏకంగా చీరల పండుగ నిర్వహిస్తున్నారు.
చీరల పుట్టుపూర్వోత్తరాలపై అధ్యయనం చేసిన హిమాంశును కదిపితే ఎన్నో సంగతులు చెబుతాడు. ఇప్పుడు మనం చూస్తున్న రూపంలో ఉన్న చీర 150 ఏళ్ల కిందటి మోడల్ అంటున్నాడు. బొంబాయిలోని పార్సీ మహిళలు - బెంగాల్ మహిళల కట్టుకు ప్రాచుర్యం లభించిందని చెబుతున్నారు. 150 ఏళ్ల కిందట చీరను రకరకాలుగా కట్టకునేవారని.. పురుషులు కూడా ధోవతీలు - చీరలు ధరించేవారన్నది హిమాంశు మాట. భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో ధోవతి - చీర అన్న పదాల మధ్య వ్యత్యాసం లేదని.. అలాంటి వస్త్రాలకు మూల పదం చీర అని.. కాబట్టి చీర అనేది కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదన్నది ఆయన భావన.
‘‘చీరలోని గొప్పదనం తెలుసుకో..’’ అన్న తెలుగు పాట కానీ హిమాంశు వింటే ఇంకా ఫిదా అయిపోతాడేమో. హిమాంశు తాను చీరలుకట్టుకోవడమే కాకుండా చీరలు కట్టుకోమంటూ మగవాళ్లందరినీ ఆహ్వానిస్తున్నాడు. మగాళ్లలో చీరకట్టుకునే అలవాటు పెంచేందుకు కృషి చేస్తున్నాడు. ఆయనలా చీరలు కట్టుకునే మగాళ్లలో చీరల పండుగ నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటున్నాడు. హిమాంశు వార్డురోబ్ లో చేనేత చీరల నుంచి పట్టు చీరలు విరకు రకరకాలు ఉన్నాయట.