Begin typing your search above and press return to search.
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ చరిత్ర ఇది!
By: Tupaki Desk | 3 Jun 2023 8:00 PM GMTబెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ - చెన్నై రైల్వే స్టేషన్ మధ్య నడిచే ఈ కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు... భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రతీరోజూ సుమారు 1661 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్. 1997 మార్చి 6న ప్రారంభమైన ఈ రైలు... గంటకు సుమారు 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
భారతదేశ తూర్పుతీరం బంగాళాఖాతం మహాసముద్రాన్ని కలిగిఉండటం వల్ల ఈ ఈ తీరాన్ని "కోరమండల తీరం" అని పిస్తారనేది తెలిసిన విషయమే. దానికి కారణం... చోళ సామ్రాజ్యం ఉన్న ప్రదేశాన్ని తమిళంలో "చోళమండలం" అని పిలుస్తారు. దీంతో ఈ ట్రైన్ కు "కోరమండల్ ఎక్స్ ప్రెస్" అని నామకరణం చేశారు.
అయితే 1977లో ఈ రైలుని తొలిసారి ప్రవేశపెట్టబడినప్పుడు... ఇది రెండు వారాలకు ఒకసారి మాత్రమే నడిచేది. అప్పుడున్న రైల్వే ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువ కావడంతో... అంత డిమాండ్ ఉండేది కాదని చెబుతారు. ఆ సమయంలో ఈ ట్రైన్ కి విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ లు మాత్రమే మెయిన్ స్టాప్ లు ఉండగా... ఖుర్దా రోడ్, ఒంగోలు లు టెక్నికల్ స్టాప్ లుగా ఉండేవి. అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిగూడెం వద్ద స్పెషల్ స్టాప్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే ఈ రైలు 23 గంటల 30 నిమిషాల వ్యవధిలోనే చెన్నై టూ హైరా కవర్ చేసేది.
అయితే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదాల్లో కూడా రికార్డులే ఉన్నాయి. ఈ ట్రైన్ కు తొలిసారిగా 2002లో నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పడుగుపాడు రోడ్డు ఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాధానికి గురైంది. ఆసమయంలో ఈ ట్రైన్ కు చెందిన ఏడు కోచ్ లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాధంలో సుమారు 100 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
అనంతరం 13 ఫిబ్రవరి 2009న ఒరిస్సాలోని భువనేశ్వర్ కు 100 కి.మీ దూరంలో ఉన్న జాజ్ పూర్ కియోంజారో రోడ్డు సమీపంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాధంలో సుమారు 16మంది మృతి చెందారు. తర్వాతి కాలంలో 2012 డిసెంబర్ లో ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ ట్రైన్ ఢీ కొనడంతో రెండు దూడలతో సహా ఆరు ఏనుగులు చనిపోయాయి.
ఇదే క్రమంలో 2012 జనవరిలో సంక్రాంతి రోజున లింగరాజ్ రైల్వే స్టేషన్ సమీపంలో జనరల్ కంపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే అదుపుచేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అనంతరం 2015 ఏప్రిల్ లో నిడదవోలు జంక్షన్ వద్ద వద్ద ఈ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాధంలో రెండు బోగీలు దెబ్బతినా... ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
తాజాగా ఇప్పుడు 2023 జూన్ 2 న తాజాగా ఈ ప్రమాధం జరిగింది. అయితే కోరమండల్ హిస్టరీలోనే కాదు.. ఇండియన్ రైల్వే హిస్టరీలో కూడా తాజాగా జరిగిన ప్రమాదమే పెద్దదని తెలుస్తుంది!