Begin typing your search above and press return to search.
జగిత్యాల ఎమ్మెల్యేకు కరోనా టీకా ఎలా వేశారబ్బా?
By: Tupaki Desk | 26 Jan 2021 3:31 AM GMTసంక్రాంతి సందడి పూర్తి అయిన వెంటనే.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ సందడి మొదలైన సంగతి తెలిసిందే. తొలిదశలో ప్రభుత్వ వైద్యులు.. వైద్య సిబ్బందితో పాటు ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. సోమవారం (జనవరి 25 నుంచి) ప్రైవేటు వైద్యులు.. వైద్య సిబ్బందికి టీకా వేయటం షురూ చేశారు. ఈ నేపథ్యంలో పలు కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు టీకాను వేసుకునేందుకు తమంట తాము ముందుకు వచ్చారు.
వ్యాక్సిన్ పైన బోలెడన్ని అనుమానాలు.. సందేహాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. టీకా వేయించుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి. అందుకు కారణం.. తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావటమే. ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యులు.. వైద్య సిబ్బంది.. ఆరోగ్య సిబ్బందికి మాత్రమే టీకా వేస్తున్నారు.
ఇలాంటివేళ.. జగిత్యాల అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ్యులు సంజయ్ కుమార్ కు తాజాగా టీకా వేశారు. లెక్క ప్రకారం చూస్తే.. రాజకీయ నేతలకు.. ప్రజాప్రతినిధులకు టీకా వేయకూడదు. అయితే.. సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అయినా.. ఆయన వైద్యుడు కావటంతో.. ఆయనకు వ్యాక్సిన్ వేశారు. ప్రైవేటు వైద్యులకు.. వైద్య సిబ్బందికి కోవిడ్ టీకాలు వేస్తున్న నేపథ్యంలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు తాజాగా టీకా వేశారు. దీంతో.. రాజకీయ నేతల్లో టీకా వేయించుకున్న వారిలో జగిత్యాల ఎమ్మెల్యే మొదటి వ్యక్తిగా చెప్పక తప్పదు.