Begin typing your search above and press return to search.

అద్బుతం ఆవిష్కారం.. మంచు యుగం నాటి జంతువుకు పునరుజ్జీవం..!

By:  Tupaki Desk   |   18 Sep 2021 12:30 AM GMT
అద్బుతం ఆవిష్కారం.. మంచు యుగం నాటి జంతువుకు పునరుజ్జీవం..!
X
సాధారణంగా ప్రాణం కోల్పోయిన తర్వాత తిరిగి రావడం అసాధ్యమన్న సంగతి అందరికీ విదితమే. కానీ, జెనెటిక్ సైంటిస్టులు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే వారు మంచు యుగం నాటి భారీ ఏనుగుల్ని మళ్లీ సృష్టిస్తామని చెప్తున్నారు. మంచు యుగం కాలంలో లారీ కంటే పెద్ద సైజు ఉన్న ఏనుగులు జీవించేవి. యూరప్, ఉత్తర అమెరికా, ఉత్తర ఆసియాలో ఇవి ఎక్కువగా ఉండేవి. వీటిని మమ్మోత్‌లు అని పిలిచే వారు. ప్రజెంట్ ఉన్న ఏనుగులలా కాకుండా ఇవి మంచులోనూ ఉండగలవు.

మంచులో ఉంటూ.. చలిని తట్టుకునేలా వీటికి వెంట్రుకలు ఉంటాయి. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉండేవి. కాగా, గతించిన ఆ ఏనుగులను హైబ్రిడ్ విధానంలో తిరిగి భూమిపై సృష్టించేందుకు ఓ భారీ సైంటిఫిక్ ప్రాజెక్టు చేస్తున్నారు శాస్త్రవేత్తలు వచ్చ ఆరేళ్లలో ఏనుగులను సృష్టిస్తామని పేర్కొంటున్నారు. 10వేల ఏళ్ల కిందటి ఏనుగులు పున: సృష్టించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ ఏనుగులు ఒక్కొక్కటి 11 నుంచి 12 అడుగుల ఎత్తు ఉండి, దాదాపు ఆరు టన్నుల బరువు ఉంటాయి. ఈ ఏనుగులు వాతావరణంలో మార్పులు సంభవించినప్పటికీ వాటిని తట్టుకోగలుగుతాయి.

అమెరికాకు చెందిన బయోసైన్స్ అండ్ జెనెటిక్స్ కంపెనీ కొలొస్సల్ ఈ ఏనుగుల్ని తిరిగి సృష్టించే ప్రాజెక్టు కోసం రూ.110 కోట్లు నిధులు సేకరించి ముందుకు సాగుతోంది. హైబ్రిడ్ మమ్మత్‌లకు పునరుజ్జీవం తెచ్చేందుకుగాను తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ మమ్మోత్‌లు అప్పట్లో పూర్వీకుల వేట వల్లే అంతరించిపోయాయని పెద్దలు చెప్తున్నారు. ఆనాటి మమ్మోత్‌ల పున:సృష్టి కోసం శాస్త్రవేత్తలు ఆల్రెడీ చనిపోయిన ఏనుగుల డీఎన్‌ఏను సేకరించారు. ఈ డీఎన్‌ఏలతో కృత్రిమ ఏనుగుల కణాలు ఫలదీకరణం చెంది హైబ్రిడ్ అండాన్ని సృష్టించి ఏనుగులను రూపొందించనున్నారు. అలా కృత్రిమ గర్భం దాల్చింపజేసి డీఎన్ఏతో ఆనాటి ఏనుగులను సృష్టిస్తున్నారు.

దాదాపు పది వేల ఏళ్ల కిందటి ఏనుగుల డీఎన్ఏ ఇప్పటికీ మంచులో భద్రంగా ఉండటం వల్లే శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. మంచులో ఉన్న మమ్మోత్ వీర్యాన్ని సేకరించి, డీఎన్ఏ పరిశీలన చేసి మొత్తంగా శాస్త్రవేత్తలు ఇంట్రెస్టింగ్ వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. మంచులో ఉండే ఈ ఏనుగులు 40 డిగ్రీల సెల్సియస్ చలిని తట్టుకుని జీవించగలవు. వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా అవి సర్వైవ్ కాగలవు. మంచులో ఏనుగులు మాత్రమే కాకుండా ఇంకా వేర్వేరు జంతువులు కూడా ఉంటాయి. వాటి వల్ల వాతావరణ సమతుల్యం అవుతుంటుంది.

ఇటువంటి సైంటిఫిక్ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే సైంటిస్టుల్లో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగే చాన్సెస్ ఉంటాయి. అయితే, సాంకేతికత రోజురోజుకూ మానవాళికి మేలు చేయడంతో పాటు పర్యావరణానికి హితం చేసే విధంగా ఆవిష్కరణలు ఇంకా జరగాల్సిన అవసరముందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే అంతరించిపోయిన పక్షులు, జంతువులు, జీవరాశిని పున:సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును ప్రపంచ దేశాల్లో ఉన్న సైంటిస్టులు ఆసక్తిగా గమనిస్తున్నారు.