Begin typing your search above and press return to search.

భారత్ లోనే అత్యంత కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన హైదరాబాదీ..!

By:  Tupaki Desk   |   14 Dec 2022 12:30 PM GMT
భారత్ లోనే అత్యంత కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన హైదరాబాదీ..!
X
కరోనా ఎంట్రీతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రజలంతా కరోనా కాలంలో వ్యక్తిగత ఆరోగ్యంపై అధిక ప్రాధాన్యం చూపించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు వీలైనంత దూరంగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యతరగతి ప్రజలు సైతం ఇటీవల కాలంలో కార్లను కొనుగోలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే భారత్ లో ఇటీవలి కాలంలో కార్ల అమ్మకాలు బాగా పెరిగిపోయాయి. మధ్య తరగతి ప్రజలు తమకు అందుబాటు ధరల్లో కార్లను కొనుగోలు చేస్తుంటే ధనవంతులు మాత్రం కాస్లీ కార్లను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మార్కెట్లోకి ఇప్పటికే లంబోర్ఘిని.. ఫెరారీ వంటి లగ్జరీ కార్లు అడుగుపెట్టాయి.

తాజాగా మాక్ లారెన్ అనే లగ్జరీ కారు భారత విపణిలో చేరింది. ఇటీవలే ఈ కారును ముంబైలో ఘనంగా లాంచ్ చేశారు. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత కాస్టీ కారుగా మాక్ లారాన్ పేరు వినిపిస్తోంది.

ఈ కారు ధర ఏకంగా 12 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాక్ లారెన్ కంపెనీ నిర్వాహకులు తమ మొదటి కారును తాజాగా డెలివరీ చేసినట్లు ప్రకటించారు.

మెక్ లారెన్ 765 ఎల్టీ స్పెడర్ మొదటి కారును హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నసీర్ ఖాన్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మాక్ లారెన్ తయారు చేసిన అత్యంత వేగవంతమైన కన్వర్టిబుల్ కార్లలో ఇది ఒకటని పేర్కొన్నారు. ఈ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించబడిందని తెలిపారు

ఈ కారు కన్వర్టిబుల్ పైకప్పు కేవలం 11 సెకన్లలో తెరుచుకుంటుందని మెక్ లారెన్ 766 ఎల్టీ ప్రత్యేకతలను వివరించారు. కాగా ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర సుమారు 12 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. భారత్ లో అత్యంత కాస్లీ కారును కొనుగోలు చేసిన నసీర్ ఖాన్ వద్ద ఇప్పటికే లంబోర్ఘిని.. రోల్స్ రాయిస్.. ఫెరారీ కార్లు ఉండటం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.