Begin typing your search above and press return to search.
దేశంలోనే అత్యంత ఖరీదైన వీధుల్లో హైదరాబాద్.. టాప్ 2లో సోమాజిగూడ
By: Tupaki Desk | 11 May 2023 10:00 PM GMTమెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించే విషయంలో, నగరంలోని సోమాజిగూడ దేశంలోని అత్యుత్తమ హై స్ట్రీట్ల జాబితాలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. నైట్ ఫ్రాంక్, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ చేసిన సర్వే ప్రకారం, బెంగళూరులోని ఎంజీ రోడ్ దేశంలోని 10 హై స్ట్రీట్ల జాబితాలో తొలి స్థానం సంపాదించింది. ఆ తర్వాత సోమాజిగూడ రెండవ స్థానంలో నిలిచింది. లింకింగ్ రోడ్ (ముంబై) ,సౌత్ ఎక్స్‌టెన్షన్ (ఢిల్లీ) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్లాగ్‌షిప్ వార్షిక రిటైల్ నివేదిక ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2023 –హై స్ట్రీట్ రియల్ ఎస్టేట్ ఔట్‌లుక్’లో భాగంగా ఫిజిటల్ రిటైల్ కన్వెన్షన్ 2023తో కలిసి, టాప్ ఎనిమిది మార్కెట్‌లలోని 30 హైస్ట్రీట్‌లకు ర్యాంకింగ్ ఇచ్చేందుకు గాను ఈ అధ్యయనం చేశారు.
దేశంలో టాప్ వీధులు ఏవి అని ఆరాతీశారు. ప్రవేశం, పార్కింగ్ సౌకర్యాలు , వివిధ రకాలైన రిటైలర్‌లతో సౌకర్యవంతంగా ఉండేవాటిపై పరిశోధన సాగింది. ఈ హై స్ట్రీట్ లేఅవుట్ , మాస్టర్ ప్లానింగ్ ఎంత బాగుందనే విషయాన్ని తెలుపుతుంది.
ఖాన్ మార్కెట్ (ఢిల్లీ) , డీఎల్ఎఫ్ గలేరియా (గురుగ్రామ్) వంటి మార్కెట్‌లు చాలా తక్కువ స్కోర్‌ను సాధించగా, ఎంజీ రోడ్ (బెంగళూరు), సోమాజిగూడ (హైదరాబాద్), లింకింగ్ రోడ్ (ముంబై), అన్నా నగర్, పార్క్ స్ట్రీట్ , కామాక్ స్ట్రీట్ (కోల్‌కతా) వంటివి దేశంలోనే టాప్ గా అత్యధిక స్కోరు సాధించాయి..
నైట్ ఫ్రాంక్ సర్వే కూడా దేశంలోని ఆధునిక, ఆధునికేతర రిటైల్ రంగాలలో అత్యధిక శాతాన్ని అంచనా వేస్తూ, కేవలం ఎన్.సీఆర్ తో మాత్రమే హైదరాబాద్‌ను రెండవ స్థానంలో ఉంచింది.
ఎన్.సీఆర్ మొత్తం 5.2 మిలియన్ స్క్వైర్ ఫీట్లతో రిటైల్ రంగాన్ని కలిగి ఉండగా, హైదరాబాద్ 1.8 మిలియన్ స్క్వైర్ ఫీట్ల తో రెండవ స్థానంలో ఉంది. అహ్మదాబాద్ , బెంగళూరు ఒక్కొక్కటి 1.5 మిలియన్ స్క్వైర్ ఫీట్ల తో ఉన్నాయి. అయితే, మొత్తం ఆధునిక రిటైల్ రంగాల శాతం పరంగా, 1.1 మిలియన్ స్క్వైర్ ఫీట్ల తో హైదరాబాద్ 1.4 మిలియన్ స్క్వైర్ ఫీట్లతో ఎన్.సీ.ఆర్ ఆక్రమించిన అగ్ర స్థానానికి దగ్గరగా ఉంది.
టాప్ 10 హై స్ట్రీట్‌లు: (ర్యాంక్ సిటీ - హై స్ట్రీట్)
1 బెంగళూరు ఎంజీ రోడ్
2 హైదరాబాద్ సోమాజిగూడ
3 ముంబై లింకింగ్ రోడ్
4 ఢిల్లీ సౌత్ ఎక్స్‌టెన్షన్ - పార్ట్ I & II
5 కోల్‌కతా పార్క్ స్ట్రీట్ మరియు కామాక్ స్ట్రీట్
6 చెన్నై అన్నా నగర్
7 బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్
8 నోయిడా సెక్టార్ 18 మార్కెట్
9 బెంగళూరు బ్రిగేడ్ రోడ్
10 బెంగళూరు చర్చి స్ట్రీట్