Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఇకపై ఆ అధికారం కలెక్టర్లదే !

By:  Tupaki Desk   |   28 July 2021 6:07 AM GMT
హైదరాబాద్ లో ఇకపై ఆ అధికారం కలెక్టర్లదే !
X
హైదరాబాద్ మహానగరంలో కొత్త లే అవుట్లకు అనుమతివ్వడం, అక్రమ లే అవుట్లను గుర్తించడం వంటి కీలక అధికారాలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పటి వరకు ఈ అధికారాలు హెచ్‌ ఎండీఏ, డీటీసీపీ(డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) ల పరిధిలో ఉంటూ వచ్చాయి. రాజధానితో సహా చుట్టూరా ఏడు జిల్లాల్లో విస్తరించిన మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళికను పటిష్టం చేయాలని భావించిన ప్రభుత్వం..మాస్టర్‌ ప్లాన్‌ ను పకడ్బందీగా అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నూతన లే అవుట్లకు అనుమతుల మంజూరు, అక్రమ లే అవుట్లను తొలగించే విషయంలో నియంత్రణ అధికారాలు చెలాయించిన హెచ్‌ ఎండీఏ, డీటీసీపీల .

కొత్త లే అవుట్ల ఏర్పాటుకు సంబంధించి హెచ్‌ ఎండీఏ, డీటీసీపీ విభాగాల నుంచి అనుమతులు సాధించడం రియల్టర్లకు, నిర్మాణ రంగ సంస్థలకు కత్తిమీద సాములానే పరిణమించింది. నెలల పాటు ఆయా విభాగాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అనుమతుల మంజూరు ఆలస్యమయ్యేది. ఆయా విభాగాల అధికారులు సవాలక్ష కొర్రీలు పెడుతూ దరఖాస్తు దారుల సహనాన్ని పరీక్షించేవారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులతోపాటు, అధికారులకు లక్షల రూపాయలు ముడుపులు సమర్పించుకున్నా అనుమతులు పొందడం సాధ్యపడడం లేదని పలువురి నుంచి ప్రభుత్వ దృష్టికి భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో ఇక నుంచి కలెక్టర్లకు ఈ అధికారాలను అప్పజెప్పడం తో లే అవుట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కానుందని, దీంతో రియల్‌బూమ్‌కు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలుంటాయని రియల్టర్లు అభిప్రాయపడుతుండడం విశేషం

హెచ్‌ ఎండీఏ, డీటీసీపీ విభాగాల నూతన విధులని చూస్తే .. మాస్టర్‌ ప్లాన్‌ ల తయారీ , పట్టణ సమగ్ర సమాచార నిర్వహణ, డిజిటల్‌ డోర్‌ నెంబర్ల విధానాన్ని రూపొందించడం. ల్యాండ్‌ యూజ్‌ ప్రణాళికలను మండలాలు, స్థానిక సంస్థల వారీగా రూపొందించడం. ప్రజోపయోగ భవనాల డిజైన్లకు అనుమతుల మంజూరు, పార్కులు, ప్లే గ్రౌండ్స్, శ్మశానాలు, వెజ్, నాన్‌ వెజ్‌ మార్కెట్ల ఏర్పాటుకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థలకు అనుమతుల మంజూరు. ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడం. డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఇక నుంచి హెచ్‌ ఎండీఏకు ఆవల ల్యాండ్‌ పూలింగ్‌ అంశానికి సంబంధించి సాంకేతిక అథారిటీగా వ్యవహరించనుంది. హెచ్‌ ఎండీఏ పరిధిలో ఈ సంస్థనే ల్యాండ్‌ పూలింగ్‌ అంశాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, టౌన్‌ప్లానింగ్‌ ప్రణాళికలను రూపొందించాలి. రహదారుల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన,పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రహదారుల విస్తరణ ప్రణాళికలు రూపొందించడం. తమ పరిధిలోని వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిలను రూపొందించడం. టీఎస్‌ బీపాస్‌ అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం, సలహాలు అందజేయడం.