Begin typing your search above and press return to search.
పోస్టులు పెట్టొద్దని చెప్పినా.. భారీ పోస్టు పెట్టిన ఐపీఎస్ రూపా
By: Tupaki Desk | 23 Feb 2023 10:04 AM GMTఒక ఐఏఎస్ అధికారిణి. మరో ఐపీఎస్ అధికారిణి. పని విషయంలో ఇద్దరు కరకుగా ఉంటారు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఒత్తిళ్లకు తలవొంచే గుణం లేని ఈ ఇధ్దరు మహిళా అధికారుల మధ్య ఏం జరిగిందన్న విషయం మీద స్పష్టత లేకున్నా.. కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. ఐపీఎస్ అధికారిణి రూపా డి. మౌద్గిల్ మధ్య నడుస్తున్న పంచాయితీ ఎంత సంచలనంగా మారిందన్నది తెలిసిందే. తన తోటి ఐఏఎస్ అధికారి సింధూరి ప్రైవేటు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రూపా వ్యవహారం జాతీయ స్థాయిలో కలకలం రేపింది.
ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత పంచాయితీ ఏమైనా.. ఇలా ఇద్దరు కీలక అధికారులు గొడవలు పడటం.. పోస్టులు పెడుతూ బజారున పడిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక బీజేపీ ప్రభుత్వం వారిద్దరికి ఉన్న పోస్టులు పీకేసి.. ఎలాంటి పోస్టు ఇవ్వకుండా ఉంచేసిన వైనం తెలిసిందే. అంతేకాదు.. ఇకపై వారు ఎలాంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టకూడదని స్పష్టం చేసింది.
ఇలాంటి వేళ.. ఐపీఎస్ అధికారిణి రూపా డి మౌద్గిల్ మరో పోస్టు పెట్టటం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఫేస్ బుక్ లో ఆమె ఒక భారీ పోస్టు పెట్టారు. అందులో తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పేశారని చెప్పాలి. వద్దంటూ వారించిన తర్వాత కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టటం ఒక ఎత్తు అయితే.. సదరు పోస్టులో ఆమె పేర్కొన్న అంశాలు కొత్త చర్చకు తెర తీయటం ఖాయమని చెప్పాలి.
తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను పోరాటం చేస్తున్నట్లుగా పేర్కొన్న రూపా.. కనీసం జాగ్రత్త పడకపోవటంతోనే తమిళనాడులో ఒక ఐపీఎస్ అధికారి.. కర్ణాటకలో మరో ఐఏఎస్ అధికారి.. మరో అధికారి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు.
"ఒక ఐఏఎస్ అధికారుల జంట విడాకులు తీసుకుంది. అందుకే నేను జాగ్రత్తపడుతున్నా. నేను.. నా భర్త ఇప్పటికీ కలిసే ఉన్నాం. కుటుంబం విచ్ఛిన్నం కాకుండా పోరాటాలు చేస్తున్నా. పలువురి జీవితాలు నాశనం అయ్యేందుకు కారణమైన మహిళను నిలదీయక తప్పదు. భారత్ అంతే కుటుంబ విలువలకు పెద్దపీట వేసే దేశమని అందరికి తెలుసు. ప్రజా జీవితాలను ప్రభావితం చేసే అవినీతిపై చేసే పోరుకు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ముందుకు రావాలి" అంటూ పేర్కొన్నారు.
తాజా పోస్టును చూస్తే.. తాను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టారన్న విషయాన్ని అందరికి తెలిసేలా చేయటమే కాదు.. తన కుటుంబంలోని విషయం వచ్చినందుకే తాను రియాక్టు అయినట్లుగా పేర్కొన్నట్లైంది. అయితే.. దీనిపై ఎలాంటి కౌంటర్ పోస్టు బయటకు రాలేదు. ఏమైనా.. ఐపీఎస్ అధికారిణి రూపా పెట్టిన పోస్టు ఇప్పుడు మరో చర్చకు తెర తీసింది. మరి.. దీనిపై ఉన్నతాధికారులు ఎలా రియాక్టు అవుతారన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.