Begin typing your search above and press return to search.

ఇది చదివాక నల్లటి మేఘం కనిపిస్తే.. కొత్త టెన్షన్ ఖాయం

By:  Tupaki Desk   |   2 May 2023 8:45 AM GMT
ఇది చదివాక నల్లటి మేఘం కనిపిస్తే.. కొత్త టెన్షన్ ఖాయం
X
ఆకాశంలో నల్లటి మేఘాల్ని చూసినంతనే మనసులో ఆనందం ఉప్పొంగుతుంది. ఎందుకంటే.. అప్పటికప్పుడు ఆకాశంలో వచ్చే మార్పులతో పాటు.. వాతవరణం ఒక్కసారిగా మారిపోతుంది. వర్షాలుభారీగా కురుస్తాయి. అందుకే ఎప్పుడు నల్లటి ముబ్బులు కనిపిస్తే చాలు.. వయసుతో సంబంధం లేకుండా మనసు ఉరకలేస్తుంది. అయితే.. నల్లటి మబ్బులకు సంబంధించి తాజాగా సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్ మెంట్ పత్రికలు కొత్త కొత్త అంశాల్ని ప్రకటించారు. చదివినంతనే వణుకు పుట్టించేలా ఉన్న ఈ వివరాలు ఎంతో ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఇలా కూడా ఉంటుందా? అన్న విస్మయానికి గురి చేసేలా ఉన్నాయి.

కెనడాలోని క్విబెక్ నగరంలోని లావల్ వర్సిటీ.. సెంట్రల్ ఫ్రాన్స్ లోని క్లెర్మాంట్ అవెర్జిన్ వర్సిటీకి చెందిన రీసెర్చర్లు మేఘాల నమూలాను సేకరించి పరిక్షించారు. 2019 సెప్టెంబరు నుంచి 2021 అక్టోబరు వరకు ఈ పరిశోధనను నిర్వహించారు.

వీరు సేకరించిన శాంపిళ్లలో దట్టమైన నల్లటి మేఘాలతో వానలే కాదు.. ప్రమాదకరమైన బ్యాక్టీరియాను మోసుకు వచ్చే మేఘాలు కూడా ఉంటాయన్న విషయాన్ని వారు గుర్తించారు. సముద్ర మట్టానికి 4806 అడుగుల ఎత్తులో ఉన్న మేఘాల నుంచి వీరు నమూనాలను సేకరించారు.

ఔషధ శక్తిని తట్టుకొని మరీ జీవించే బ్యాక్టిరియా ఈ మేఘాల్లో నిండి ఉంటుందని.. వాటితో పాటు సదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుందన్న విషయాన్ని గుర్తించారు. ఒకరకంగా చెప్పాలంటే.. ప్రపంచం మొత్తాన్ని చుట్టేసే ఈ నల్లటి మేఘాల గురించి తాజా అధ్యయనం బోలెడన్ని విషయాల్ని వివరించింది. ఒక మిల్లీ లీటర్ మేఘంలో సగటున ఉన్న బ్యాక్టీరియా సంఖ్య 8వేలుగా గుర్తించారు. ఈ బ్యాక్టీరియాలో 29 ఉప వర్గాలకు చెందిన యాంటీ బయాటిక్ ను తట్టుకునే జన్యువులు ఉన్నట్లుగా గుర్తించారు. కొన్ని సందర్భాల్లో మిల్లీలీటర్ పరిణామంలో కనిష్ఠంగా 330 గరిష్ఠంగా 30వేలకు పైగా బ్యాక్టీరియాలు ఉంటాయని తేలింది.

ఇంతకీ ఈ బ్యాక్టిరీయాతో ఉన్న మేఘాలు ఎలా ఏర్పడతాయన్న విషయంలోకి వెళితే.. భూమి మీద ఉన్న చెట్లపైన.. ఇతర ప్రాంతాల్లోని బ్యాక్టీరియా గట్టి గాలుల ద్వారా వాతావరణంలోకి.. అటు నుంచి మేఘాల్లోకి చేరుతాయి. వాటితోపాటు సదూరాలకు పయనిస్తాయి.

ఎక్కడైతే వర్షాలు పడతాయో.. అప్పుడు మేఘాల నుంచి భూమి మీదకు చేరుతాయి. అంటే.. బ్యాక్టీరియా ప్రయాణానికి మేఘాలు రవాణా సాధనాలుగా మారతాయన్న మాట. అయితే.. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

ఈ బ్యాక్టీరియాలో ఐదు నుంచి యాభై శాతం వరకు మాత్రమే క్రియాశీలకంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మేఘాల బ్యాక్టీరియాతో మనుషులకు ముప్పు తక్కువేనని.. వర్షంలో బయటకు నడవాలంటే భయపడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ అంశంపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంటుందని మాత్రం చెబుతున్నారు.