Begin typing your search above and press return to search.

వయసు పెరిగినా యంగ్​ గా ఉండాలంటే.. ఈ కూర తినండి..!

By:  Tupaki Desk   |   23 Nov 2020 9:10 AM GMT
వయసు పెరిగినా యంగ్​ గా ఉండాలంటే.. ఈ కూర తినండి..!
X
పాలకూర తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ కూరలో అనేక విటమిన్లు ఉంటాయి. విటమిన్​ ఏ, సీ, కే, బీ12, తో పాటు ఫోలిక్​ఆసిడ్​, మాంగనీస్​, మెగ్నిషియం, ఐరన్​ ఉన్నాయి. ఎముకల గట్టిపాడాలన్నా , కళ్ల సమస్యలు రాకూడదన్నా పాలకూర తినాలి. అయితే పాలకూర మనం తరుచూ తింటే వయసు పెరిగినా మనం యవ్వనంగానే కనిపిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఏ, బీటా కెరాటిన్ వల్ల మన వయసు కనిపించదని చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు ఏదో రకంగా పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.

పాలకూరతో మరికొన్ని ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. ఎముకలు గట్టిపడేందుకు. శరీరంలోని అన్నిభాగాలకు రక్తం సరఫరా చేసే ఎర్ర రక్తకణాల పనితీరుకు కూడా పాలకూర ఎంతో ఉపయోగపడుతుంది. పాలకూరలో ఇనుము, ఫోలేట్, అమినో ఆసిడ్ ఎక్కువ, రక్తం లో “హుమేసిస్టన్” మోతాదు ని నియంత్రించి సన్నని రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకుల్ని తగ్గిస్తుంది. అయితే పాలకూర తింటే శృంగారపరమైన ఆసక్తి కూడా కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. పాలకూరలో ఉండే విటమిన్​ ఏ వల్ల కంటి చూపు బాగా ఉంటుందని..కంటికి సంబంధించిన వ్యాధులు కూడా రావు.

అంతేకాక విటమిన్​ సీ వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ప్రస్తుతం రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకే కరోనా సోకుతుంది. కాబట్టి ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం కూడా పాలకూరను తీసుకోవాలి. వయస్సు పెరిగేకొద్ది ఎముకలు బలహీనపడి కాళ్లనొప్పులు తదితర సమస్యలు వస్తాయి. అటువంటి వాళ్లు పాలకూరను తీసుకుంటే మంచిది. ఎముకలు గట్టిపడతాయి. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడంలో మేలు చేస్తాయి. పాలకూరలో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం దూరం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పాలకూర దివ్య ఔషధం.

పాలకూరతో గుండె సమస్యలు, కాన్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి. కాన్సర్ కణాలతో వ్యతిరేకంగా పోరాడుతుంది. అదే విధంగా టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు దూరం అవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఫుడ్. గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. జీర్ణ సమస్యలు, నిద్ర లేమి సమస్యలు దూరం అవుతాయి. దీంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. ఎముకలు బలంగా మారేలా చేస్తుంది. శరీరానికి ఆక్సిజన్ అందేలా చూస్తుంది. ప్రెగ్నెన్సీ మహిళలకు ఈ పాలకూర ఎంతో మంచిది.. పాలకూరలో పొటాషియం కండరాలను బలపరుస్తుంది. కండరాల సమస్యలతో బాధపడేవారు.. పాలకూరని తినడం మంచిది.. దీనిని తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.