Begin typing your search above and press return to search.
వైసీపీ ర్యాలీలో 'సీఎం... పవన్' నినాదాలు ఏం జరిగిందంటే
By: Tupaki Desk | 1 Nov 2022 1:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటేనే వైసీపీ నాయకులు తెగ మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్న రాష్ట్ర రాజకీయం తాజాగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా మారిపోయింది. ఒకరిపై ఒకరు రుస రుసలాడుతున్నారు.
మమ్మల్ని కొట్టించావని వైసీపీ నేతలు అంటే.. మా నాయకుడిపై కుట్ర పన్నారంటూ జనసేన నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇలా.. ఒకరిపై ఒకరు రాజకీయ కామెంట్లతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఇలా ఉన్న పరిస్థితిలో ఆకస్మికంగా వైసీపీ నాయకులకు విద్యార్థులు షాక్ ఇచ్చారు.
వైసీపీ నేతలు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు... ఆ గూటి పాట పాడకుండా.. జనసేన నినాదాలు అందుకున్నారు. జెండాలు మాత్రం వైసీపీవే అయినప్పటికీ.. నినాదాలు మాత్రం జనసేనవి. జై పవన్.. సీఎం పవన్.. అంటూ విద్యార్థులు రెచ్చిపోయారు. దీంతో వైసీపీ నాయకులు ఖంగుతిన్నారు. ఏంచేయాలో అర్ధంకాక బిక్కచూపులు చూశారు. సరే.. ఇంతకీ ఈ విషయం ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.
విషయంలోకి వెళ్తే.. మూడు రాజధానులకు మద్దతుగా.. ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు రోజుకొక విషయాన్ని తెరమీదకు తెస్తున్నారు. ఇటీవల రాజీనా మాలు అన్నారు. తర్వాత.. గర్జన చేశారు. ఇక, ఇప్పుడు ర్యాలీలకు తెరదీశారు. అంటే.. మూడు రాజధానులు పాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ నాయకులు ర్యాలీలు చేస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరంలో(ఇక్కడ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. అయితే.. ఇది చెల్లలేదు) ఎంపీ సత్యవతి(కాకినాడ) సహా ఇతర నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు.
వాస్తవానికి ర్యాలీకి నేతలు రావాలి. కానీ, ఏమనుకున్నారో.. ఏమో.. విద్యార్థి భేరి పేరుతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు, కాలేజీల విద్యార్థులను ఈ ర్యాలీకి తరలించారు. అయితే..ర్యాలీకి వచ్చిన విద్యార్థులు ఏమనుకున్నారో.. అసలు ఈ కార్యక్రమం ఎవరిదని అనుకున్నారో తెలియదు కానీ, వారికి నచ్చిన, మెచ్చిన నటుడు పవన్ నామస్మరణలో మునిగి తేలారు.
జై.. పవన్.. జై సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఇతర నేతలు షాక్‌కు గురయ్యారు. విద్యార్థులు.. ఏమీ అనలేరు. దీంతో వారికి సర్దిచెప్పి.. జై జగన్ అని అనిపించడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.