Begin typing your search above and press return to search.
కొత్త ట్విస్టు: ఎమ్మెల్సీ కవిత కాదు ఆమె భర్త టార్గెట్టా?
By: Tupaki Desk | 16 Feb 2023 9:00 PM GMTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత పేరు పదే పదే ప్రస్తావన రావటం.. ఆమెపై త్వరలోచర్యలు తప్పవన్న మాట తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కాంలో కవిత పాత్రకు సంబంధించి ఇప్పటికే సీబీఐ ఛార్జిషీట్లలో పేర్కొన్నది. దీంతో.. ఆమె అరెస్టు తప్పదన్న ప్రచారం జోరందుకుంటోంది. అయితే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఒక భారీ ట్విస్టు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.
అందరి అంచనాలకు భిన్నంగా త్వరలో ఒక బిగ్ బ్రేకింగ్ చోటు చేసుకుంటుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు ఉండటం.. ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించటం పూర్తైంది. అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా ఈ ఉదంతంలో కవిత భర్త అనిల్ ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అదెలా అనేదానికి ఒక వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ లోని కవిత నివాసంలో సౌత్ గ్రూప్ నకు చెందిన ప్రతినిధులు సమావేశం అయ్యారని.. ఈ మీటింగ్ లో కవిత భర్త అనిల్ కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు.
దీంతో.. ఈ సమాచారానికి అనుగుణంగా వివరాల్ని సేకరిస్తున్న ఈడీ.. సీబీఐలు దానికి సంబంధించిన ఆధారాల్ని దొరకబుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. కవిత నివాసంలో జరిగిన మీటింగ్ లో పాల్గొన్న వారిలో రామచంద్రన్ పిళ్లై.. బోయినపల్లి అభిషేక్.. శరత్ చంద్రారెడ్డి పాల్గొన్నారని.. ఈ భేటీలో అనిల్ ఉన్నారన్న దానికి తగిన ఆధారాలు విచారణ అధికారులు సంపాదించినట్లుగా తెలుస్తోంది.
దీంతో.. ఆ సమావేశంలో ఏం జరిగింది? అందులో ఏం మాట్లాడుకున్నారు? పాలసీ రూపకల్పనలో ఏం జరిగింది? లాంటి వివరాల్ని అనిల్ ద్వారా తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కవిత మాదిరి ఆయన్ను ప్రశ్నిస్తారా? లేదంటే అదుపులోకి తీసుకుంటారా? అన్నది ప్రశ్నగా మారింది.
అందరి అంచనాలకు తగ్గట్లు త్వరలోనే బిగ్ బ్రేకింగ్ చోటు చేసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే తాము అదుపులోకి తీసుకున్న వారిని విచారించిన సందర్భంగా తమ భేటీలో అనిల్ కూడా ఉన్నారన్న ఆధారాలతో తదుపరి అడుగులు పడతాయని.. అదే జరిగితే సీఎం కేసీఆర్ కు భారీ షాకిచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.