Begin typing your search above and press return to search.
పవర్ ఫుల్ ప్లేస్ అయితే చాలు కవిత వెళ్లి పూజలు చేస్తున్నారా?
By: Tupaki Desk | 16 Feb 2023 10:25 AM GMTఢిల్లీ మద్యం కుంభకోణంలో అనూహ్యంగా వచ్చిన పేరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారాలపట్టిగా పేరున్న కల్వకుంట్ల కవిత. తొలుత ఆమె పేరు బయటకు వచ్చినప్పుడు.. విమర్శలు చేసేందుకు విపక్షాలు సిద్ధమైన వేళ.. కోర్టుకు వెళ్లి తనను విమర్శించకూడదని ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవటం.. ఈ స్కాంలో చిక్కుకున్న వేళ.. తనకు అత్యంత సన్నిహితుల ముందే కుమార్తెపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ అంశంపై ఒక మీడియా అధినేతకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తాను పడిన ఇబ్బందిని దాచుకునే ప్రయత్నం చేయలేదు. 'ప్రగతిభవన్ లో జరిగిందని.. కంటితో చూసినట్లు రాశారు. అందులో నిజం లేదు. అతడెవరో చెప్పేయండి. తీసి పారేద్దాం అంకుల్' అంటూ ఇంటర్వ్యూలో చెప్పిన కవిత మాటలు అప్పట్లో వైరల్ కావటమే కాదు.. అందరి నోట్లో నానిన పరిస్థితి.
ఈ సందర్భంగా సదరు మీడియా సంస్థ విశ్వసనీయత గురించి సందేహాలు వ్యక్తం చేసిన కవితను ఉద్దేశించి.. సదరు మీడియా సంస్థ అధినేత మీ నాన్న నిన్ను ఏమాట అన్నది చెప్పమంటావా? అంటూ వ్యాఖ్యానించటం.. ఆయన మాటల్ని కట్ చేసి.. వేరే విషయంలోకి వెళ్లటం తెలిసిందే. ఇదంతా ఒకప్పటి విషయాలు. తాజాగా ఏం జరుగుతుందన్న విషయంలోకి వెళ్లినప్పుడు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కవిత చుట్టూ కమ్మేస్తుందని.. ఒకరి తర్వాత ఒకరుచొప్పున అరెస్టులు జరుగుతున్న వేళ.. త్వరలోనే కవిత అరెస్టు తప్పదన్న చర్చలు మొదలయ్యాయి.
తాను టార్గెట్ చేసిన వారు ఎవరైనా సరే.. వదిలేది లేదన్నట్లుగా వ్యవహరించే మోడీ సర్కారు.. ఎమ్మెల్సీ కవిత విషయంలో పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. తమపై అదే పనిగా విరుచుకుపడుతున్న కేసీఆర్ సంగతి తేల్చే పనిలో నిమగ్నమైన కేంద్ర పెద్దలు.. తమకు దొరికిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరని చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులో బాధ్యులుగా చూపిస్తూ కవిత అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే.. అరెస్టు ఎప్పుడు జరుగుతుందన్న ప్రశ్నకు సరైన సమాధానం బయటకు రావటం లేదు. ఇలాంటి వేళ.. కవిత ఏం చేస్తున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. తనను ఇరుకున పెట్టి.. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్న మోడీ సర్కారుపై విరుచుకుపడేందుకు ఆమె సంకోచించటం లేదు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ఆయన రియాక్టు అవుతున్నారు. అదే సమయంలో.. తనను అరెస్టు చేసే పరిస్థితులను మార్చేందుకు ఆమె ఇప్పుడు అథ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు.
పవర్ ఫుల్ స్వామీజీల గురించి ఎవరు చెప్పినా.. వారికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పరిశీలించి.. అంతా బాగున్నట్లుగా గుర్తిస్తే చాలు.. అక్కడకు వెళ్లి.. వారి ఆశీస్సులు పొందే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రత్యేక పూజలు.. హోమాలు.. జపాలు కూడా చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కవిత అరెస్టు ఇంతకు ముందే జరగాల్సి ఉన్నా.. ఏదో ఒక అంశం అడ్డుగా నిలవటంతో ఆమె అరెస్టు ఆగుతుందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా ఆమె కలిసిన బాబాల ఆశీస్సులు.. భారీ ఎత్తున చేయిస్తున్న హోమాల ఫలితమే అన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ వాదనలోనిజం ఎంతన్న విషయాన్ని కాలమే డిసైడ్ చేయాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.