Begin typing your search above and press return to search.
రాపాకకు అంత సీన్ ఉందా...?
By: Tupaki Desk | 27 March 2023 12:02 AM GMTజనసేనకు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఎపుడూ సంచలనమే.. ఎందుకంటే ఆయన ఒకటి ఒంటరి అంకె మాదిరిగా గెలిచారు. కానీ సవ్యంగా పార్టీలో ఉండలేదు దానికి అధినాయకత్వం కారణం అని ఆయన అంటారు. తనకు సరైన మర్యాద ఇవ్వలేదని చెప్పేవారు. జనసేనలో ఆను ఏకైక ఎమ్మెల్యే కాబట్టి రాచమర్యాదలు కావాలని జరగాలని ఆయన కోరుకున్నారు కానీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కదా. ఉప నాయకుడు నాదెండ్ల మనోహర్ కదా.
ఇక జనసేనలో కీలక నేతలు ఉన్నారు కదా. ఏది ఏమైనా రాపాక అధికార వైసీపీలో ఉండాలనుకున్నారు దానికి వేరే కారణాలు వెతుక్కున్నారు. టోటల్ గా ఆయన వైసీపీ ఎమ్మెల్యే అయిపోయారు. ఈ పరిణామంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదట్లో బాధపడినా ఆ తరువాత ఆ ఊసే ఎత్తలేదు ఒక విధంగా పవన్ని ఇక్కడే మెచ్చుకోవాలి.
తాము గెలిపించిన ఎమ్మెల్యేల విషయంలో అధినేతలు ఎలా ఉంటారో వారు గీత దాటితే ఎంతలా కటువుగా వ్యవహరిస్తారో అంతా చూస్తూనే ఉన్నారు. అలాంటిది పవన్ మాత్రం పోతే పోనీ అని ఉన్నతంగానే ఉన్నారు. ఇక రాపాక వైసీపీలో ఉంటూ తన భవిష్యత్తుని అక్కడే వెతుక్కుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ అని తెలిసి వైసీపీలో చిరకాలంగా ఉన్న ఒక నాయకుడు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటే అది రాపాక గొప్పతనమే.
ఏది ఏమైనా అధినాయకత్వానికి ఆయన నచ్చేశారు అలా జరుగుతోంది అంతే. ఇపుడు చూస్తే ఏపీలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ ఎపిసోడ్ పెద్ద ఎత్తున కాక రేపుతోంది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా చెబుతూ సజ్జల రామక్రిష్ణారెడ్డి కోట్ల రూపాయలు ఇచ్చి చంద్రబాబు కొనుగోలు చేశారు అని అన్నారు. దాని మీద ఇపుడు వైసీపీ సస్పెండ్ ఎమ్మెల్యేలు అంతా మండిపడుతున్నారు.
సరే వారి వెర్షన్ అధికార వైసీపీ నుంచి కౌంటర్లు అవన్నీ పక్కన పెడితే మధ్యలోకి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వచ్చేశారు. తనను కూడా కొనుగోలు చేయడానికి టీడీపీ మనుషులను పంపించిందని, ఏకంగా పది కోట్ల దాకా ఆఫర్ చేశారు అని కూడా చెబుతున్నారు. తాను అయితే జగన్ మీద వీర లెవెల్ లో భక్తి విధేయత ఉన్న వాడిని కాబట్టి నో చెప్పానని ఆయన అంటున్నారు.
ఈ తతంగం అంతా తన మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా నడిపారని, అయితే తన మిత్రుడే రాపాక అలా తీసుకొనే వ్యక్తి కాదని చెప్పి వారించారని రాపాక చెప్పుకున్నారు. ఇక ఇక పోలింగ్ రోజు నాడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తనకు నేరుగా ఆఫర్ ఇచ్చిందని రాపాక అంటున్నారు. అంతే కాదు తెలుగుదేశం పార్టీలోకి వస్తే భవిష్యత్ లో మంచి అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారని చెప్పారు. తాను మాత్రం వారి ఆఫర్ ను తిరస్కరించానని రాపాక అంటున్నారు.
ఇక్కడ ఆయన రెండు విషయాల్లో లాజిక్ మిస్ అయ్యారని విమర్శలు వస్తున్నాయి. మొదటిది ఏంటి అంటే ఆయన ఫక్తు వైసీపీ ఎమ్మెల్యే కాదు. ఆయన కూడా జనసేన నుంచి వైసీపీ వైపు జంప్ చేసిన ఎమ్మెల్యే. రెండవది జనసేన టీడీపీ కలసి పొత్తులు పెట్టుకోబోతున్నాయని అంటున్నారు. అలాంటిది జనసేనకు వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేను టీడీపీ కోరి కొనుగోలు చేస్తుందా అన్నదే చర్చగా ఉంది.
మరి ఈ లాజిక్ ని రాపాక ఎలా మిస్ అయ్యారో మరి. ఇక్కడ రాపాకే ఒక డౌట్ కూడా వచ్చేలా మాట్లాడుతున్నారు. ఆయన జనసేన నుంచి వైసీపీకి జంప్ చేసినపుడు ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటారు అన్న డౌట్ ని ఆయన మాటల ద్వారానే వ్యక్తం చేసే అవకాశాన్ని కలిగిస్తారు. నిజానికి అధికార పార్టీ వైపు ఆయనంత ఆయనే వచ్చారని అంటారు. పైగా డబ్బులిచ్చి కొనే అవసరం అయితే వైసీపీకి లేదన్నది నిజం. దాంతో రాపాక అధికార ఎమ్మెల్యేగా ఉండాలని పనులు చేయించుకోవాలని కోరికతోనే జంప్ చేశారనుకోవాలి.
అలా ఒక సారి రాపాక ఒక పార్టీలోకి జంప్ చేసేశాక కూడా ఆయన్ని మళ్ళీ కోట్లు పెట్టి తమ వైపు తిప్పుకోవడానికి టీడెపీఎ చూస్తుంది అన్నది అయితే అంత నమ్మశక్యంగా లేదనే అంటున్నారు. అలా అనుకున్నా రాపాకకు అంత సీన్ ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.