Begin typing your search above and press return to search.

ఢిల్లీ టూర్ అట్టర్ ఫ్లాపేనా ?

By:  Tupaki Desk   |   27 Oct 2021 9:10 AM GMT
ఢిల్లీ టూర్ అట్టర్ ఫ్లాపేనా ?
X
చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన టోటల్ గా ఫెయిల్ అయినట్లే అర్థమైపోతోంది. ఎలాగైనా రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు చేయించటం ద్వారా రాష్ట్రపతి పాలన విధించేట్లుగా కేంద్రాన్ని ఒప్పించాలని చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల టూర్ లో రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ను మాత్రమే కలవగలిగారు. ఢిల్లీ టూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ అమిత్ షా అపాయిట్మెంటే కీలకం. అయితే మోడీ, షా లు చంద్రబాబుకు అపాయిట్మెంట్ దక్కలేదు.

రెండు రోజులు వెయిట్ చేసినా వాళ్ళ ను కలవడం సాధ్యం కాదని తేలిపోవటంతో చంద్రబాబు అండ్ కో తిరుగు ప్రయాణమయ్యారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ఢిల్లీ టూర్ ఫ్లాప్ అని అర్ధ మైపోతోంది. గడచిన రెండున్నర సంవత్సరాలు గా మోడి, షా అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు చాలా సార్లే ప్రయత్నించారు. అయినా వాళ్ళ తో చంద్రబాబు భేటీ సాధ్యం కావటం లేదు.

కరోనా వైరస్ బాగా ఉదృతం గా ఉన్న కాలం లో ఒక సారి అమిత్ షా ఒక సారి చంద్రబాబు తో ఫోన్లో మాట్లాడారంతే. ఆ తర్వాత నేరు గా కలిసే ఉద్దేశ్యం తో చంద్రబాబు అపాయిట్మెంట్ అడిగితే మాత్రం షా ఇవ్వటం లేదు. 2019 ఎన్నికల కు ముందు మోడి, షా ని చంద్రబాబు ఎన్నెన్ని మాటలు అన్నది, ఆరోపణలు చేసింది అందరికీ తెలిసిందే. తిరుమల దర్శనానికి వచ్చిన తన వాహనం పై టీడీపీ నేతలు చేసిన దాడులను షా మరచిపోలేదని బీజేపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.

ఇక మోడి మీదైతే 2019 ఎన్నికల సందర్భం గా చంద్రబాబు వ్యక్తిగతం గా కూడా అనేక విమర్శలు చేశారు. తల్లిని, భార్య కే న్యాయం చేయ లేని మోడి ఇక దేశాని కి ఏమి చేస్తాడంటూ అనేక రోడ్డు షోల్లో చంద్ర బాబు పదే పదే మోడి కుటుంబ విషయా లను ప్రస్తావించారు. ఇలాంటి అనేక కారణాల తో అప్పటి నుండి చంద్ర బాబు ను పై ఇద్దరు పూర్తి గా దూరం పెట్టేశారు. బీజేపీ తో కలుద్దామని చంద్రబాబు ఎంత గా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు.

నిజానికి చంద్ర బాబు ఢిల్లీ టూరు ను రాంగ్ టైం లో ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే అమిత్ మూడు రోజులు కాశ్మీర్లోనే క్యాంపు వేశారు. మంగళ వారం మధ్యాహ్నమే ఢిల్లీ కి తిరిగొచ్చారు. షా ఢిల్లీ కి తిరిగొచ్చిన సమయానికి చంద్ర బాబు ఢిల్లీ లోనే ఉన్నా అపాయిట్మెంట్ మాత్రం ఇవ్వలేదు. ఎలాగైనా వీళ్ళద్దరి అపాయిట్మెంట్ సంపాదించాలని టీడీపీ ఎంపీలు, వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద చంద్ర బాబు ఢిల్లీ టూరు అట్టర్ ఫ్లాప్ అన్నది వాస్తవం. తర్వాతేమి చేస్తారో చూడాలి.