Begin typing your search above and press return to search.

కేసీఆర్ జాతీయ పార్టీ అసలు ప్లాన్ ఇదేనట?

By:  Tupaki Desk   |   13 Sep 2022 5:05 AM GMT
కేసీఆర్ జాతీయ పార్టీ అసలు ప్లాన్ ఇదేనట?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై వ్యూహాత్మకంగా కదులుతున్నారు. అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాతే ముందుకెళుతున్నారు. ఈ మేరకు ఆయన జెండా, ఏజెండా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. పక్కా ప్రణాళికతోనే కేసీఆర్ ఈ జాతీయ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేతలతో విస్తృతంగా చర్చిస్తున్న కేసీఆర్.. ఈ మేరకు జాతీయ పార్టీతో ఆ ప్రాంతీయ పార్టీల పొత్తు పెట్టుకునేలా స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా ఇప్పటికిప్పుడు అది దేశవ్యాప్తంగా సత్తా చాటే అవకాశాలు లేవు. అందుకే ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు సాగాలని యోచిస్తున్నారు. రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత ఆయా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం.

అయితే ప్రాంతీయ పార్టీలతో కూటమిని కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటే జాతీయ పార్టీ అవసరం లేదు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఏర్పాటు చేయవచ్చు. కానీ టీఆర్ఎస్ ను కాదని కొత్త పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ నడుం బిగిస్తున్నట్టు తెలుస్తోంది.

కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సఖ్యత ఉన్న పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా పోటీచేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీలు కేసీఆర్ తో పొత్తు పెట్టుకొని.. సీట్లు కేటాయించే అవకాశం లేదు. కర్ణాటకలో జేడీఎస్ అయినా.. బీహార్ లో ఆర్జేడీ, జేడీయూ అయినా కూడా కేసీఆర్ ఉనికి లేని జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోరు. ఢిల్లీలో ప్రబలంగా ఉన్న కేజ్రీవాల్ సైతం అంతే.. అందుకే కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్నా సరే.. ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా ఈ ప్రాంతీయ పార్టీలు ఇచ్చే అవకాశం లేదు.

ఏ రాష్ట్రంలో అయినా ఇతర పార్టీలు బలపడడానికి అవి అంగీకరించవు. అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా కూడా.. కేంద్రంలో అధికారం కోసం ప్రాంతీయ పార్టీల నేతలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆసక్తిగా మారింది. బీజేపీని గద్దెదించేందుకు ఇవన్నీ ప్రత్మామ్మాయం కోసం చూస్తాయి. ఆ లక్ష్యంతోనే ఓ జాతీయ వేదికను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారం సాధించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.

అయితే జాతీయ పార్టీ.. లేదంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి జాతీయ పార్టీని నిలబెట్టడం.. ఈ రెండు వ్యూహాలతోనే కేసీఆర్ ముందుకు సాగుతున్నట్టు అర్థమవుతోంది. బీజేపీని ఎదుర్కోవాలంటే జాతీయ పార్టీ అవసరం కాబట్టి దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ముందుకు సాగాలని యోచిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.