Begin typing your search above and press return to search.
ఏకంగా టాటాలనే ఢీకొట్టేలా.. అంబానీ కూతురు దూకుడు!
By: Tupaki Desk | 28 Jun 2023 12:20 PM GMTఇప్పటికే తండ్రికి తగ్గ తనయగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ. రూపురేఖల్లోనూ తం్రyì నే పోలి ఉన్న ఇషా వ్యాపార మెళకువల్లోనూ తండ్రికి ధీటుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ.. రిలయన్స్ రిటైల్ కు ఇషా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రిలయన్స్ మార్టులు, రిలయన్స్ ఫ్రెష్ లు, ఆన్‌లైన్ జియో మార్టులను విజయవంతంగా ఇషా నడిపిస్తున్నారు.
అంతేకాకుండా రిలయన్స్ రిటైల్ ను మరిన్ని రంగాలకు విస్తరిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగంపైన ఇషా దృష్టి సారించారు. ఈ రంగంలో ఏకంగా టాటాలను మించిపోయేలా ఆమె వ్యూహాలకు తెరతీశారు. కాఫీ విభాగంలో వినియోగదారుల ఆదరణ చూరగొని దూసుకుపోతున్న టాటా గ్రూప్ అనుబంధ సంస్థ.. స్టార్ బక్స్ ఇండియాకు పోటీగా ఇషా కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గత దశాబ్ద కాలంగా భారత్ కాఫీ వ్యాపార విభాగంలో టాటా గ్రూప్ కు చెందిన స్టార్ బక్స్ ఇండియా అత్యంత విజయవంతమైంది. 2012లో టాటా గ్రూప్ దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. కేవలం పదేళ్లలోనే స్టార్ బక్స్ కాఫీ ప్రియుల మనసులు దోచుకుంది. పదేళ్ల తర్వాత ఏడాదికి రూ.1000 కోట్ల కాఫీ అమ్మకాల్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది.
దీంతో స్టార్ బక్స్ కు పోటీగా ఇషా అంబానీ కూడా రంగంలోకి దిగారు. యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)లో కాఫీ, శాండ్ విచ్ విభాగంలో ఐకానిక్ బ్రాండ్ అయిన ‘ప్రెట్ ఎ మ్యాంగర్’ తో ఇషా అంబానీ చేతులు కలిపారు. ఈ మేరకు ఇటీవల ఆ సంస్థతో ఇషా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒప్పందంలో భాగంగా రిలయన్స్ రిటైల్ జాయింట్ వెంచర్.. ప్రెట్ ఎ మ్యాంగర్ కార్యకలాపాల్ని భారత్ లో మొదలు పెట్టింది. బ్రిటన్ లో దిగ్గజ కంపెనీ అయిన ప్రెట్ ఎ మ్యాంగర్.. తన తొలి కాఫీ షాపును ముంబైలోని బాంద్రా – కుర్లా కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీ, బెంగళూరుతో పాటు మొత్తం 12 నగరాల్లో ఈ కాఫీ షాపులు అందుబాటులోకి రానున్నాయి.
టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన స్టార్ బక్స్ కు పోటీగా ప్రెట్ ఎ మ్యాంగర్ ను నిలపాలని ఇషా అంబానీ భారీ వ్యూహాలు రచిస్తున్నారు. టీ, కాఫీలకు యువతలో పెరిగిపోతున్న మోజుకు తగ్గట్టే విభిన్న రుచులను వినియోగదారులకు అందించనున్నారు.
కాగా, ప్రెట్ ఎ మ్యాంగర్ కు ప్రపంచవ్యాప్తంగా 550 స్టోరులున్నాయి. ఈ బ్రాండ్ ఆర్గానిక్ కాఫీ, కుకీలు, సలాడ్, శాండ్ విచ్‌ల అమ్మకాలకు పేరు పొందింది.
మరోవైపు టాటా స్టార్‌బక్స్ భారత్ లోని 43 నగరాల్లో 341 స్టోర్ లను నిర్వహిస్తోంది. చిన్న పట్టణాల్లో విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇషా అంబానీ కూడా ఈ రంగంలోకి వస్తుండటంతో ఈ రెండు సంస్థల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది.