Begin typing your search above and press return to search.

కమలనాథుల కొంప ముంచనున్న షెట్టర్ సతీమణి కన్నీళ్లు?

By:  Tupaki Desk   |   18 April 2023 9:33 AM GMT
కమలనాథుల కొంప ముంచనున్న షెట్టర్ సతీమణి కన్నీళ్లు?
X
రాజకీయ రంగంలో సెంటిమెంట్ కు మించిన శక్తివంతమైన అస్త్రం మరేదీ ఉండదు. ఎన్నికల భారతంలో ఈ విషయం ఇప్పటికే పలుమార్లు ఫ్రూవ్ అయ్యింది. మరి.. ఈ కీలక విషయాన్ని కమలనాథులు ఎందుకు మిస్ అవుతున్నారు. తాజాగా జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్న తీరు.. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆ పార్టీ నేతలు అనుసరిస్తున్న విధానం కొత్త సమీకరణలకు తావిచ్చేలా చేస్తోంది.

ఇప్పటికే బీజేపీ టికెట్ ఆశించి.. జాబితాలో తమ పేరు లేని నేపథ్యంలో కడుపుమండి.. కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న బీజేపీ నేతలకు.. ఆ పార్టీ టైమ్లీగా టికెట్లను ఇస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతుంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఎలా ఉన్నా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టర్ కు తాజాగా బీజేపీ అధినాయకత్వం టికెట్ ఇవ్వకుండా హ్యాండివ్వటం తెలిసిందే.

దీన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆయన.. ఆ వెంటనే కాంగ్రెస్ లో చేరటం టికెట్ తీసుకోవటం లాంటి పరిణామాలు వరుస పెట్టి చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరినంతనే టికెట్ కన్ఫర్మ్ కావటం తెలిసిందే. గంటల వ్యవధిలోనే ఆయన తన సొంత నియోజకవర్గమైన హుబ్బలి- ధార్వాడ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఊహించని రీతిలో ఘన స్వాగతం లభించింది.

తన భర్తకు లభించిన ఘన స్వాగతం నేపథ్యంలో శెట్టర్ సతీమణి శిల్ప తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. శెట్టర్ ను హత్తుకొని ఏడ్చేశారు. ఇక.. పార్టీ మారిన నిర్ణయాన్ని అభినందిస్తూ.. ఆయనకు అండగా నిలుస్తామని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన భర్త రాక ముందు మీడియాతోనూ.. అభిమానులతోనూ మాట్లాడిన ఆమె.. తన భర్త బీజేపీ కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. కానీ.. పార్టీ మాత్రం తన భర్తను ఘోరంగా అవమానించినట్లు పేర్కొన్నారు.

టికెట్ కు నో చెప్పటమే కాదు.. తమ పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును ప్రస్తావించి ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు శెట్టర్ సైతం స్పందించారు. ఒక సీనియర్ నేతగా తనకు టికెట్ వస్తుందని భావించినట్లు చెప్పారు. అయితే.. తనకు టికెట్ ఇవ్వలేదని.. దీంతో తాను షాక్ కు గురైనట్లు చెప్పారు. ఆ తర్వాత కూడా పార్టీ మారకూడదని ఎవరూ తనను సమాధానపర్చలేదన్నారు.

వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఘన విజయాన్నిసాధించటం.. బలమైన లింగాయత్ వర్గానికి చెందిన ఆయన 2012-13లో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అలాంటి బలమైన నేతకు కమలనాథులు టికెట్ ఇవ్వకుండా అవమానించిన వైనం ఇప్పుడు ఎమోషన్ కు కారణమైంది. తాజా పరిణామాలు చూసినప్పుడు శెట్టర్ భార్య కన్నీళ్లు కమలనాథుల కొంప ముంచే వీలుందన్న మాట వినిపిస్తోంది.