Begin typing your search above and press return to search.
గడప గడపకూ జగన్ పోస్టర్... ముందస్తు సినిమా చూపిస్తారా ..?
By: Tupaki Desk | 9 Feb 2023 9:30 AM GMTముందస్తు ఎన్నికలు అన్న ప్రచారం ఏపీని వీడడం లేదు. నిజానికి జగన్ సీఎం అయిన ఆరు నెలల నుంచి ఈ ప్రచారం స్టార్ట్ అయింది. జగన్ అప్పట్లోనే రెండేళ్ల వ్యవధి ఉండగా ఎన్నికలకు వెళ్తారని తెలుగుదేశం చెబుతూ వచ్చింది. ఇపుడు చూస్తే అది కాస్తా ఏడాదికి దగ్గర పడింది. అయినా తెలుగుదేశం అనుమానాలు అలాగే ఉన్నాయి. జగన్ అయిదేళ్ళ ఫుల్ టెర్మ్ సీఎం కారని చంద్రబాబు గాఢమైన భావనగా చెబుతారు.
అలా ఎందుకు అంటే ఆర్ధిక రాజకీయ కారణాలతో పాటు అనేకం ఉన్నాయని అంటారు. అందుకే జగన్ 2023లో ముందస్తు సినిమా చూపిస్తారు అని అంటున్నారు. దాని కోసం జగన్ ఇపుడు ఇంటింటికీ తన పోస్టర్లను అంటిస్తున్నారు అని కూడా విపక్షం ఊహిస్తోంది. లోకేష్ పాదయాత్ర ఈ కారణంగానే స్టార్ట్ చేశారు పవన్ వారాహీ కూడా ఎపుడెప్పుడు రోడ్డెక్కుదామా అని చూస్తోంది. చంద్రబాబు జిల్లా టూర్లు ఎటూ ఉన్నాయి.
ఇపుడు ఈ మధ్యలో మరింత వేడి రాజేయడానికి జగన్ పల్లె నిద్ర అంటున్నారు. సాధారణంగా సీఎం స్థాయి నేతలు ఎన్నికల వేళ మాత్రమే జనాల్లోకి ప్రచారానికి వస్తారు. అంటే 2024 ఏప్రిల్ లో బస్సు ఎక్కాల్సిన జగన్ 2023 ఏప్రిల్ లోనే బస్సెక్కి వస్తున్నారు అంటే ఏదో తేడా కొడుతోందని విపక్ష శిబిరం సస్పెక్ట్ చేతోంది.
ఏపీలో జగన్ ఎన్నికల నగరా మోగించడానికే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నరు. ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయి. అలా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలు పెట్టించుకుంటే తనకు సేఫ్ గా ఉంటుందని ఆయన భావిస్తూనే వేగంగా పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. అందువల్లనే పల్లె నిద్ర పేరిట జగన్ కూడా జనంలోకి వస్తున్నారు అని అంటున్నారు.
ఇక ఎన్నికలకు ఆరు నెలల లోపు టికెట్లు కన్ ఫర్మ్ చేస్తాను అని జగన్ చెబుతున్నారు అంటే అది కూడా డిసెంబర్ ఎన్నికల కోసమే అంటున్నారు. అదే విధంగా విశాఖకు షిఫ్ట్ కావడం చూసుకున్నా జగన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అని అంటున్నారు. ఇలా చాలా విషయలను కలుపుకుని విపక్షం అయితే ఈ ఏడాది ఎన్నికల గోదారే అని భావిస్తోందిట.
ఇదిలా ఉంటే గతంలో ముందస్తు ఎన్నికలు అని తెలుగుదేశం సహా విపక్షాలు ఎంత చెప్పినా అవి తేలిపోయాయి. కానీ ఈసారి అలా కాదనే భావిస్తున్నాయిట. జగన్ వైఖరి చూసినా ఆయన ఇస్తున్న హామీలు, ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్న తీరు గృహ సారధుల పేరిట ఇంటింటికీ తిరిగి పోస్టర్లు స్టిక్కార్లు అతికించమని పురమాయించడం ఇవన్నీ కూడా ఎన్నికల సందోహమే అని లెక్కేసుకుంటున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏపీలో ఎన్నికలను మరింత సాగదీసి షెడ్యూల్ ప్రకారం పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అని జగన్ అనుకుంటున్నారు అని చెబుతున్నారు.
ఈ నేపధ్యంలోనే ఆరు నూరు అయినా 2023 లో ఎన్నికలు రావడం ఖాయమని అంటున్నారు. మరి లోకేష్ జనంలోకి వచ్చేశారు. ఇపుడు జగన్ ముందా పవన్ ముందా అన్న చర్చ సాగుతోంది. ఇద్దరూ బస్సు యాత్రలే అంటున్నారు. కాబట్టి ఈ రెండు బస్సులు ఆ మీదట అటూ ఇటూ నేతల కస్సుబుస్సులు చూసిన తరువాత ముందస్తు సినిమా రిలీజ్ ఎపుడో ఇట్టే చెప్పేయవచ్చు అని అంటున్నారు. సో ఏపీలో ముందస్తుకు అంతా రెడీ అయిపోతున్నారు అన్న మాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.