Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర‌ కు జ‌గ‌న్ బ్రేక్!

By:  Tupaki Desk   |   14 Feb 2020 9:30 AM GMT
చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర‌ కు జ‌గ‌న్ బ్రేక్!
X
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాజీ సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని టీడీపీ గ‌త రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ ఘోరంగా ఓడిపోయింది. 40 ఈయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే చంద్ర‌బాబు.....ఫార్టీస్‌లో ఉన్న యువ నేత వైఎస్ జ‌గ‌న్ చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు. అన్నంలేక‌పోయినా బ్ర‌త‌క గ‌లిగిన చంద్ర‌బాబు....అధికారం లేక‌పోయే స‌రికి అత‌లాకుత‌లం అయిపోయారు. అధికారంలో లేక‌పోయినా తానే సీఎం అని ఫీల‌వుతున్న చంద్ర‌బాబు....ఎలాగైనా ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టాల‌ని నానా పాట్లు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ స‌ర్కార్‌పై విష ప్ర‌చారం చేసేందుకు రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌స్సుయాత్ర చేసేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ్యారు. 45 రోజుల్లో 175 నియోజ‌క‌ వ‌ర్గాల్లో బ‌స్సు యాత్ర చేసి...జ‌గ‌న్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాల‌కున్నారు. అయితే, అనూహ్యం గా చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర‌ కు జ‌గ‌న్ బ్రేకులు వేశారు.


చంద్ర‌బాబు వ్యూహాల‌కు జ‌గ‌న్ చెక్ పెట్టారు. అమ్మఒడి...పెన్ష‌న్ ఎత్తివేత‌లు...రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ వంటి అంశాల‌లో వైసీపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ప్ర‌చారం చేయాల‌నుకున్న చంద్ర‌బాబుకు బ్రేక్ వేశారు. మార్చి 15లోపు పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాలని జగ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో చంద్ర‌బాబు ఇర‌కాటంలో ప‌డ్డార‌ట‌. దీంతో, త‌న బ‌స్సు టూర్ క్యాన్సిల్ చేసుకోవాల‌ని బాబు యోచిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలా...లేక ప్ర‌భుత్వం వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేలా బ‌స్సు యాత్ర‌ను కొన‌సాగించాలా అన్న డైల‌మా లో బాబు ప‌డ్డార‌ట‌.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ఘోర ప‌రాభ‌వంతోపాటు...మండ‌లి ర‌ద్దు వంటి అంశాల‌తో చాలా మంది టీడీపీ నేత‌లు బీజేపీలో చేర‌డం... వైసీపీకి మ‌ద్ద‌తు తెల‌ప‌డం వంటివి చేస్తున్నారు. దీంతో, రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటి చంద్ర‌బాబు కేడ‌ర్‌లో ఉత్సాహం నింపాల‌నుకుంటున్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వం మీద‌...ఈ ఎన్నిక‌లు రెఫ‌రెండం వంటివ‌ని తెలుగు త‌మ్ముళ్లు అనుకుంటున్నార‌ట‌. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌లసీమ‌ల్లో అధికార వికేంద్రీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ చంద్ర‌బాబు ప్ర‌చారం చేయ‌లేని ప‌రిస్థితి. ఆ ఫార్ములా కేవ‌లం ఉభ‌య గోదావ‌రి, కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల వ‌ర‌కే ప‌రిమితం కావ‌చ్చు. మిగ‌తా ప‌థ‌కాలు కూడా బాగానే ఉన్నాయి....కాబ‌ట్టి ఈ ఎన్నిక‌ల్లో వైసీపీని టీడీపీ ఎలా ఎదుర్కొంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.


ఈ క్ర‌మంలో స‌రిగ్గా ప్ర‌చారం చేసి ప‌రువు ద‌క్కించుకుంటే చాలు అన్న‌ట్లు టీడీపీ నేత‌ల ప‌రిస్థితి ఉంది. ఇక ఇప్పుడు బస్సు యాత్ర‌లంటూ తిరిగితే...టీడీపీలో ఉన్న కొద్దిమంది కూడా ప‌క్క‌చూపులు చూస్తార‌ని బాబు అంత‌ర్మ‌థ‌నం అట‌. జ‌గ‌న్ దెబ్బ‌కు చంద్ర‌బాబు ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎల‌క‌లా త‌యారైంద‌ని, ఇటు ముందు నుయ్యి వెనుక గొయ్యి....అన్న చందంగా చంద్రాల సార్ సిట్యువేష‌న్ ఉంద‌ని సెటైర్లు ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు బ‌స్సెక్కి యాత్ర చేస్తారా.....సైకిలు తొక్కి ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తారా అన్న‌ది ఆస‌క్త‌క‌రంగా మారింది.