Begin typing your search above and press return to search.

జగన్ సెలెక్ట్ చేసిన మొదటి ఎంపీ ...?

By:  Tupaki Desk   |   6 May 2023 10:26 PM GMT
జగన్ సెలెక్ట్ చేసిన మొదటి ఎంపీ  ...?
X
జగన్ కొందరిని బాగా నమ్ముతారు. నమ్మినవారిని ఆయన తానుగా వదులుకోరు. ఇక తేడా వస్తేనే లెక్కలు తప్పుతాయని అంటారు. ఇపుడు అలా జగన్ కి అత్యంత నమ్మకస్తుల జాబితాలో విశాఖ జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎంపీ కొత్తగా చేరిపోయారు. ఆయనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఆయన 2018 జూలైలో వైసీపీలో చేరారు. తొమ్మిది నెలలు తిరగకుండా విశాఖ వంటి ప్రతిష్టాత్మకైన సీటుకు ఎంపీ అయిపోయారు.

బిల్డర్ గా, ఆర్ధిక బల సంపన్నుడిగా ఉన్న ఎంవీవీ అంటే జగన్ మొదటి నుంచి ప్రత్యేకంగానే చూస్తూ వచ్చారు. ఆయనకు విజయసాయిరెడ్డికి మధ్య అప్పట్లో వివాదాలు వస్తే జగన్ స్మూత్ గా డీల్ చేసి ఇష్యూని సెటిల్ చేశారు తప్ప ఎంవీవీని ఏమీ అనకపోవడం విశేషం. ఇక ఏపీలో జగన్ సెలెక్ట్ చేసిన మొదటి ఎంపీ అభ్యర్ధి 2024లో ఎంవీవీ అనే చెప్పాలి.

ఇటీవల తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి ఎంవీవీని పిలిపించుకుని మరీ మరోసారి పోటీకి సిద్ధం కావాలని కోరారని టాక్. దానికి ఎంవీవీ సైతం అంగీకరించారు. ఇక నాలుగు రోజుల క్రితం విశాఖ పర్యటనకు వచ్చిన జగన్ ఎంవీవీ ఇంటికి స్వయంగా వెళ్లారు. ఆయన కుమారుడికి పెళ్ళి అయి నెలలు గడచిపోయింది. అయినా వధూవరులను ఆశీర్వదించారు.

విశాఖకు గతంలో జగన్ రావాలనుకున్న టూర్ రద్దు అయింది. అలా ఎంవీవీ ఇంటికి వచ్చే కార్యక్రమం కూడా రద్దు అయింది. అయితే దాన్ని గుర్తు పెట్టుకుని మరీ జగన్ రావడం పట్ల ఎంపీ వర్గం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతోంది. మరో వైపు చూస్తే విశాఖ జిల్లాకు సంబంధించి ఎంవీవీని ఆర్ధిక అంగ బలంగా జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికలు మామూలుగా జరగవు, పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది.

దాంతో విశాఖ వంటి కీలకమైన ఎంపీ సీట్లో ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించేందుకు అవసరమైన ఇంధనాన్ని ఎంవీవీ సమకూర్చుతారు అన్న భరోసాతోనే ఆయన్ని దగ్గరకు తీస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఇక ఈసారి వైసీపీ ఇక్కడ నెగ్గి అక్కడ కేంద్రంలో బీజేపీకి మద్దతు అవసరం అయితే మాత్రం కచ్చితంగా కేంద్ర మంత్రిగా ఎంవీవీని చూడవచ్చు అని కూడా ప్రచారం సాగుతోంది.

వాస్తవానికి రాష్ట్ర మంత్రి కావాలని ఎంవీవీ భావిస్తున్నారు. అందుకోసం ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని ఎంచుకుని అన్నీ రెడీ చేసుకున్నారు. కానీ సామాజిక సమీకరణల నేపధ్యంలో ఆ సీటు ఇవ్వలేకపోతున్నారు. దాంతో పాటు ఎంపీగా గట్టి అభ్యర్ధిగా ఎంవీవీ వంటి నేత ఉండాలని జగన్ భావిస్తున్నారు. దీంతో ఆయన పోటీ తప్పడంలేదు. దాంతో వచ్చే ఎన్నికల తరువాత అన్నీ అనుకూలిస్తే కేంద్ర మంత్రిగా ఎంవీవీ అవుతారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేసిన ఈ ఎంవీ కూల్ గా ఉంటూ తన పనులు తాను చక్క్కబెట్టుకునే టాలెంటెడ్ అని అంటారు అంతా.