Begin typing your search above and press return to search.
ఆ సీటు పవన్ కి బంగారు పళ్ళెంలో ?
By: Tupaki Desk | 23 April 2023 6:00 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట ఎత్తితే చాలు వైసీపీ నేతలు విరుచుకుపడుతూ చేసే ఘాటైన విమర్శ ఒకటి ఉంది. రెండు చోట్లా పోటీ చేసి ఓడిన ఆయన మాకు చెప్పేది అంటూ గాలి తీసేస్తారు. పవన్ పార్టీని జనాలు పట్టించుకోలేదని కూడా అంటారు. ఓడిన పవన్ మాకు నీతులు చెప్పడమేంటి అని వారు సెటైర్లు వేస్తారు. నిజానికి పవన్ వైసీపీ వారు ఎన్ని విమర్శలు చేసినా భరిస్తారు కానీ ఓటమి విషయంలో చేసే ఎద్దేవా మాత్రం ఆయనని బాగా హర్ట్ చేస్తూ ఉంటుంది.
అలాంటి పవన్ కి ఇపుడు వైసీపీ వారే బంగారు పళ్ళెంలో పెట్టి అప్పచెప్పే సీటు గాజువాక అంటే ఆశ్చర్యం కాదు కానీ అది పచ్చి నిజమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని పొరపాట్ల వల్లనే ఈ సీటు చేజారింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆయన నామినేషన్ వేస్తే గాజువాక మొత్తం తరలివచ్చింది.
దాంతో పవన్ గెలుపు నల్లేరు మీద నడక అనుకున్నారు. అయితే పవన్ ఆ తరువాత మాత్రం మళ్లీ ప్రచారానికి రాలేదు. ఇక ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తూ అన్న మాటలు ఇది నా సొంత జిల్లా అని. దాంతో కూడా గాజువాకలో వైసీపీ నేతలు రివర్స్ లో ప్రచారం చేఅసి పవన్ కి ఓటేస్తే ఏముంది అంటూ తేల్చేశారు.
ఇక పవన్ తరఫున ప్రచారం చేసిన వారు కూడా సరిగ్గా జనంలోకి వెళ్ళకపోవడం వంటి వాటి వల్ల చివరికి ఆయన 14,520 ఓట్ల తేడాతో ఓడారు. ఇక్కడ పవన్ కి 56,125 ఓట్లు వస్తే టీడీపీ తరఫున నిలబడిన పల్లా శ్రీనివాసరావుకు 54,642 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డికి 74,645 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం జనసేన ఓట్లు కలితే లక్షా పది వేల పై చిలుకు ఉంటాయి. అంటే ముప్పయి ఆరు వేల ఓట్ల భారీ తేడాతో ఇక్కడ వైసీపీ ఓడి ఉండేది అని అంటారు.
గాజువాకలో పవన్ కి మద్దతు ఇపుడు పెరుగుతోంది. బలమైన సామాజికవర్గం అండ ఎటూ ఉంది. ఇక ఇక్కడ ముప్పయి వేల దాకా ఉక్కు కార్మిక కుటుంబాలు ఉన్నాయి. వారంతా వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో పాటు వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి పనితీరు పట్ల సామాన్య జనాలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. వైసీపీలో వర్గాలు కూడా ఉన్నారు. టికెట్ కోసం నాగిరెడ్డి వారసుడుతో పాటు బయట నుంచి పోటీ పడుతున్న వారు చాలా మంది ఉన్నారు.
స్టీల్ ప్లాంట్ ఇష్యూలో సరిగ్గా డీల్ చేయలేదని వైసీపీ సర్కార్ మీద ఉన్న గుర్రు కాస్తా వైసీపీ నుంచి ఎవరు నిలబడినా మైనస్ అవుతుందనే అంటున్నారు. దీంతో గాజువాక కచ్చితంగా జనసేనకు కలసి వచ్చే సీటు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి నిలబడితే గెలిపిస్తామని జనాలు అంటున్నారు.
గతంలో కొన్ని తప్పులు చేయడం వల్ల జనసేన ఓడిందని ఈసారి పార్టీ గ్రాఫ్ పెరిగిందని, నాయకులు కూడా ఎలా పనిచేయాలో నేర్చుకున్నారని అంటున్నారు. అందువల్ల పవన్ని రమ్మని పిలుస్తున్నారు. మూడొంతులు పవన్ గాజువాక నుంచి పోటీ చేయవచ్చు అని అంటున్నారు. టీడీపీతో పొత్తు లేకపోయినా పవన్ గెలుస్తారు అని అంటున్నరు పొత్తు ఉంటే మాత్రం భారీ మెజారిటీ పవన్ సొంత కావడం తధ్యమని అంచనాలు ఉన్నాయి.
ఒకవేళ పవన్ పోటీ చేయకపోయినా ఈసారి జనసేనకే పొత్తులో భాగంగా ఈ సీటుని తీసుకుంటారని, అది ఆయన సెంటిమెంట్ అంటున్నారు. ఆ విధంగా కనుక తీసుకుంటే గాజువాక నుంచి సీనియర్ నేత జనసేన పీఏసీ మెంబర్ అయిన కోన తాతారావు పోటీ చేస్తారని అంటున్నారు. ఆయన సామాజికవర్గం కూడా గాజువాకలో ఎక్కువ. దాంతో పాటు కాపులు కూడా కొమ్ము కాస్తే జనసేన విశాఖలో గెలిచే ఫస్ట్ సీటు ఇదే అవుతుంది అంటున్నారు. మొత్తానికి నాడు పవన్ని సవాల్ చేసి మరీ గెలిచిన వైసీపీ ఇపుడు తమ స్వీయ తప్పుల వల్ల పవన్ కి జనసేనకు బంగారు పళ్ళెంలో పెట్టి మరీ సమర్పించుకుంటోందా అంటే జవాబు అవును అనే వస్తోంది.