Begin typing your search above and press return to search.

జిన్ పింగ్ ఇదేందిదీ..యుద్ధానికి రెడీగా ఉండాలని సైన్యానికి పిలుపు

By:  Tupaki Desk   |   15 Oct 2020 3:30 AM GMT
జిన్ పింగ్ ఇదేందిదీ..యుద్ధానికి రెడీగా ఉండాలని సైన్యానికి  పిలుపు
X
సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తూ నిత్యం కవ్విస్తున్న చైనా మరో దుస్సాహసానికి ఒడి గట్టింది. ఇటీవలే చైనా సైన్యం క్యాంపులను సందర్శించని ఆ దేశాధి నేత జిన్ ​పింగ్​ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పీఎల్​ఏ (పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ) యుద్ధానికి సిద్ధంగా ఉండాలని.. సర్వశక్తులు ఒడ్డాలని పిలుపునిచ్చాడు. ఇప్పటికే భారత్​, చైనా సరిహద్దుల నడుమ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జిన్ ​పింగ్​ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. బుధవారం జీ జిన్‌పింగ్ గ్యాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న మిలిటరీ బేస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే
దక్షిణ చైనా సముద్రం పై చైనా పెత్తనం పై అమెరికా, భారత్ సహా పలు దేశాలు మండి పడుతున్న విషయం తెలిసిందే.

జిన్ ​పింగ్​ ఇదేంది?

దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ జలాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్​ పై అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర క్వాడ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశమై చైనా తీరును తప్పుపట్టాయి. అక్టోబర్ 2న 7వ కార్ప్స్ కమాండర్ లెవల్ మీటింగ్ తర్వాత చైనా, భారత్‌లు వాస్తవాధీన రేఖ వెంట బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి. ఇటువంటి సందర్భంలో జిన్​ పింగ్​ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మా దేశ అంతర్గత విషయాలు మీకేందుకు?

మరోవైప ఇటీవల చైనా తరుచూ భారత్​ అంతర్గత విషయాలపై జోక్యం చేసుకుంటున్నది. లడఖ్‌ ను భారత్ కేంద్రపాలిత ప్రాంతంగా చేయడాన్ని తాము ఒప్పుకోమంటూ పేర్కొన్నది. అసలు భారత్​ లో అంతర్భాగంగా ఉన్న లడఖ్​ విషయంలో చైనా పెత్తనమెంటని విదేశాంకశాఖ స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చింది. మా దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించింది.