Begin typing your search above and press return to search.

ఒకే ఇష్యూ మీద తండ్రీ..కొడుకుల వేర్వేరుగా మాట్లాడారే?

By:  Tupaki Desk   |   2 Dec 2019 6:14 AM GMT
ఒకే ఇష్యూ మీద తండ్రీ..కొడుకుల వేర్వేరుగా మాట్లాడారే?
X
ఒకే విషయం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందిచిన తీరు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. జాతీయ స్థాయిలో సంచలనంగా మారి.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసుకు సంబంధించి కాస్త లేటుగా ఈ ఇద్దరు ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. అయితే.. వీరి రియాక్షన్ లో ప్రస్తావించిన డిమాండ్లు భిన్నంగా ఉండటం ఒక పాయింట్ అయితే.. కీలకమైన అంశం మీద తండ్రీకొడుకులు మాటలు వేర్వేరుగా ఉండటమా? అన్నది ప్రశ్నగా మారింది.
దిశ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేసును తొందరగా తేల్చేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల వరంగల్ లో తొమ్మొది నెలల పసిగుడ్డుపై అత్యాచారం.. హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 56 రోజుల్లోనే విచారణ పూర్తి అయి.. తీర్పు వెలువడిన విషయాన్ని వెల్లడించారు. వెటర్నరీ డాక్టర్ విషయంలోనే అలానే జరగాలన్న ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం చేశారు.
సీఎం ఆదేశాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టుకు లేఖ రాస్తున్నట్లు రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. న్యాయశాఖ నుంచి ఆమోదం వచ్చినంతనే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ ను ఏర్పాటు చేసి రోజు వారీగా విచారణను చేపడతామని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇదే అంశం మీద వరుస ట్వీట్లను చేశారు మంత్రి కేటీఆర్. ఆసక్తికరమైన విషయం ఏమంటే తాను చేసిన ట్వీట్లను ప్రధాని మోడీకి ట్యాగ్ చేశారు. దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి విధించిన శిక్షను అమలు చేయటంలో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రస్తావించారు. నిర్భయను అతి దారుణంగా అత్యాచారం.. హత్య చేసి ఏడేళ్లు అయ్యిందని.. దోషులకు ఇప్పటికి ఉరిశిక్ష అమలు చేయలేదన్నారు.

ఇటీవల వరంగల్ లో తొమ్మిది నెలల పసిగుడ్డు మీద అత్యాచారం జరిగిందని.. కింది కోర్టు నిందితుడికి మరణశిక్ష విదిస్తే.. దాన్ని హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చిందన్నారు. హైదరాబాద్ లోని వెటర్నరీ వైద్యురాలును అత్యంత పైశాచికంగా అత్యాచారం చేసి చంపేశారని.. నిందితుల్ని పట్టుకున్నా.. న్యాయం కోసం పోరాడుతున్న కుటుంబానికి ఏ రీతిలో ఊరట ఇవ్వగలమని ప్రశ్నించారు.

ఒకవేళ నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తండ్రి కేసీఆర్ పేర్కొంటూ.. అలాంటి కోర్టుల కారణంగా ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ తండ్రి కేసీఆర్ ప్రస్తావించిన ఉదంతాన్నే కొడుకు కేటీఆర్ భిన్నంగా ట్వీట్ చేయటం విస్మయానికి గురి చేస్తోంది. ఒకే అంశం మీద తండ్రీకొడుకులిద్దరి స్టాండ్లు వేర్వేరుగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కన్ఫ్యూజన్ లో ఉన్నారా? కమ్యూనికేషన్ గ్యా్ప్ ఉందా? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు.