Begin typing your search above and press return to search.
పుట్టినరోజు వేళ.. నడిరోడ్డు మీద కేటీఆర్ హగ్
By: Tupaki Desk | 25 July 2020 9:30 AMతెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ధూంధాంగా జరిగింది. కరోనాతో ప్రజలంతా కిందామీదా పడుతున్న వేళలో వచ్చిన పుట్టిన రోజును సింఫుల్ గా జరుపుతున్నట్లు కేటీఆర్ చెప్పినా.. పార్టీ నేతలతో పాటు ఇతర ప్రముఖులే కాదు.. ఆయన అనుచరగణం పుట్టినరోజును భారీగానే నిర్వహించారని చెప్పాలి. సోషల్ మీడియాలో అయితే మోత మోగిపోయేలా సాగింది. కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీ పడ్డారు. ఇందులో విశేషం ఏమంటే.. ఆ రంగం.. ఈ రంగం అన్న పరిమితులు లేకుండా.. అన్ని రంగాలకు చెందిన వారు విషెస్ చెప్పినోళ్లలో ఉన్నారు.
సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినోళ్లు కొందరైతే.. రామన్న బర్త్ డే సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం ఉన్న కరోనా టైంలో నడిరోడ్డు మీద పార్టీ నేత ఒకరిని ఆత్మీయ హగ్ చేసుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ భౌతికదూరాన్ని పాటించాలని గొంతులు అరిగిపోయేలా చెబుతున్నారు.
చెప్పేవాళ్ల పని చెప్పటం.. వినేవాళ్ల పని వినటమే అన్నట్లుగా.. చెప్పింది వినటమే కానీ అమలు చేయటం లేదా? అన్న భావన తాజా ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మానదు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తానే స్వయంగా కలిసి బర్త్ డే విషెస్ చెప్పాలని మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు భావించారు. ఈ క్రమంలో కేటీఆర్ కు సర్ ప్రైజ్ చేసేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఎలాంటి సమాచారం లేకుండా ఆయన్నుకలిసిశారు.
ఇటీవల కాలంలో అధిష్ఠానం మీద గుర్రు పెంచుకున్న మైనంపల్లి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ ఉంది. ఇలాంటివేళ.. అందుకు భిన్నంగా మంత్రి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చారు. రోడ్డు మీద కేటీఆర్ వద్దకు వెళ్లిన మైనంపల్లిని చూసి మంత్రి ఆశ్చర్యానికి గురి చేశారు. అదే క్రమంలో కాస్తంత చొరవగా మైనంపల్లి కేటీఆర్ ను హైదరాబాద్ స్టైల్లో ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
దీనికి కేటీఆర్ వెల్ కం చెప్పటంతో ఈ గాఢ ఆలింగనం ఇప్పుడు వైరల్ గా మారింది. కరోనా వేళ.. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే.. ఇలా ఆత్మీయ హగ్ లు ఇవ్వటం ఎంతమేర సబబు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా కరోనా వేళ.. పార్టీ నేతకు ఆత్మీయ హగ్ ఇచ్చిన కేటీఆర్ దమ్మును పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.