Begin typing your search above and press return to search.

డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర... క్లారిటీ ఇదే!

By:  Tupaki Desk   |   28 Jun 2023 4:00 PM
డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర... క్లారిటీ ఇదే!
X
గతకొన్ని రోజులుగా తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం హల్ చల్ చేస్తుంది. ఇదే క్రమంలో నిత్యం డ్రగ్స్ వాడకం, డ్రగ్స్ పార్టీలంటూ వార్తలు కనిపిస్తుంటాయి. అయితే హైదరాబాద్ లో జరిగే డ్రగ్స్ వ్యవహారాల్లో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపణలు వస్తుంటాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ మేరకు కేటీఆర్ పై ఇటువంటి ఆరోపణలు చేస్తుంటారు.

అయితే ఈ విషయాలపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. తనకు డ్రగ్స్ వ్యవహాలకు లింకులు పెడుతూ వస్తోన్న విమర్శలపై ఘాటుగానే స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న కేటీఆర్ కు ఒక ఘాటైన ప్రశ్న ఎదురైంది. హైదరాబాద్ లో ఉన్న పబ్ లు, లిక్కర్ మాల్స్ కు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ కు ఒక ప్రశ్న ఎదురైంది. ఇదే సమయంలో డ్రగ్స్ వ్యవహరానికి సంబంధించి టెస్టులకు రమ్మని కోరిన అంశం కూడా చర్చకు వచ్చింది.

దీంతో ఈ విషయాలపై వివరణ ఇచ్చిన కేటీఆర్... రేవంత్ రెడ్డి వ్యభిచారి అని తాను ఆరోపిస్తాను.. రుజువు చేసుకుంటాడా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మాట్లాడేముందు ఇంగిత జ్ఞానం, సంస్కారం ఉండాలని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో తన జీవితంలో సిగరేట్ కూడా తాగలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రజలకు ఏమి కావాలో ఆ అంశాలపై మాట్లాడకుండా ఇలా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయాలకు సూచన అని కేటీఆర్ ఫైరయ్యారు.

సిద్ధాంతాలపై మాట్లాడలేక ఇలా తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని.. "తండ్రి తాగుబోతు, కొడుకు తిరుగుబోతు" అంటూ కుసంస్కారంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆవేదన ఆగ్రహం కలిపి వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో తన కొడుకు కాస్త లావుగా ఉన్న సమయంలో "పంది" అని సంబోదించాడని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.