Begin typing your search above and press return to search.
వర్మ కెలికితే... కేటీఆర్ ఇలా స్పందించాడు
By: Tupaki Desk | 12 Dec 2018 6:29 AMసంచలన మెజార్టీ సొంతం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయ దుందుబి పై గులాబీ దళపతి కేసీఆర్ సహా ఆ పార్టీ ముఖ్యులైన కేటీఆర్- హరీష్ రావు- కవితకు అభినందనలు తెలియచేస్తున్నారు. ఇందులో రాజకీయ ప్రముఖులతో పాటు.. సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అయితే, తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా శుభాకాంక్షలు తెలిపారు. తనదైన శైలిలో వర్మ చెప్పిన శుభాకాంక్షలకు మంత్రి కేటీఆర్ సైతం అదే రీతిలో స్పందించారు.
టీఆర్ఎస్ విజయం పట్ల ట్విట్టర్ లో వర్మ ట్వీట్ చేస్తూ... 'హేయ్ కేటీఆర్. మీ నాన్న 2.0 మాత్రమే కాదు.. రజనీకాంత్ కంటే 20.0 రెట్లు.... మహేష్ బాబు కంటే 200.0 రెట్లు... చంద్రబాబు కంటే 2000.0 రెట్లు ఎక్కువ ' అంటూ ట్వీట్ చేశారు. దీని పై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. ‘ఈ విషయం నాకెప్పుడో తెలుసు... ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది రాము గారు’ అంటూ చురక అంటించారు. దీనికి కూడా వెంటనే కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘ఆ విషయం నాకు అర్థం కాలేదనే విషయం అర్థమవుతోంది... మీకు, మీ నాన్నకు 2.0 బిలియన్ ఛీర్స్... అందరు హీరోయిన్ల కంటే కేసీఆరే అందంగా ఉంటారు. నేను ఎప్పటి నుంచో చెబుతున్నా... కానీ ఇప్పుడు అందరు హీరోల కంటే కేసీఆర్ హ్యాండ్‌సమ్ గా ఉంటారు.. హిమాలయాలకంటే ఆకర్షణీయంగా ఉంటారు... గుజరాత్ లో అతి పెద్ద విగ్రహాన్ని ప్రధాని మోడీ ఏర్పాటు చేస్తున్నారు... తెలంగాణలో 2.0 రెట్ల పెద్దదైన కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలి’ అంటూ ట్విస్ట్ ఇచ్చారు.