Begin typing your search above and press return to search.
మైలేజీ కోసం ఫ్లెక్సీ పెడితే.. మిత్రపక్ష నేతకు షాకిచ్చిన కేటీఆర్
By: Tupaki Desk | 23 May 2020 2:41 PM ISTఅయినోళ్లు ఎంత పని చేసినా చూసిచూడనట్లుగా వ్యవహరించటం ఒక పద్దతి. పూర్తిగా వెనకేసుకురావటం మరో పద్దతి. ఈ రెండూ చాలామంది ముఖ్యనేతల్లో కనిపిస్తాయి. కానీ.. కొన్నిసార్లు సొంతోళ్లకే షాకిచ్చే నేతలు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. కొన్ని విషయాల్లో ఆయన.. తర తమ భేదాల్ని అస్సలు పట్టించుకోరన్న పేరుంది. దీనికి తగ్గట్లే మరోసారి వ్యవహరించి తమకు అత్యంత విశ్వసనీయమైన మిత్రపక్షానికి చెందిన మహిళా నేతకు ఊహించని షాకిచ్చారు.
హైదరాబాద్ మహానగరంలో ఒకే రోజులో 45 బస్తీ దవాఖాలు ప్రారంభించటం తెలిసిందే. శుక్రవారం నిర్వహించిన ఈ దవాఖానాల్లో ఎర్రగడ్డలో స్టార్ట్ చేసిన దవాఖానాకు తానే స్వయంగా పాల్గొని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా అనుమతి లేకున్నా.. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఫ్లైక్సీపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రచారం కోసం ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేయించటంపై కేటీఆర్ మొదట్నించి విముఖత ప్రదర్శిస్తుంటారు. ఫ్లైక్సీలు ఏర్పాటు చేయొద్దని కోరుతుంటారు.
ఇందుకు భిన్నంగా టీఆర్ఎస్ నేతలు.. ఇతర పార్టీ నేతలు తరచూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేస్తుంటారు. తాజాగా బస్తీ దవాఖానా ప్రారంభోత్సవానికి హాజరవుతున్న మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ ఎర్రగడ్డ కార్పొరేటర్.. మజ్లిస్ నేత షాహీన్ బేగం పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో మంత్రి కేటీఆర్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఫోటోల్ని వేయించారు. ఈ ఫ్లెక్సీని చూసిన కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీల ఏర్పాటు మీద బ్యాన్ ఉన్న వేళ.. ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించటమే కాదు.. దాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ కు రూ.20వేల ఫైన్ వేయాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో.. మంత్రి ఆదేశాల మేరకు కార్పొరేటర్ కు రూ.20వేల ఫైన్ వేసినట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. మైలేజీ కోసం ఏర్పాటు చేసిన ఫ్లైక్సీ చివరకు ఫైన్ తిప్పల్ని తెచ్చి పెట్టిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.