Begin typing your search above and press return to search.
కార్ రేసుతో కేటీఆర్ అదరగొట్టేశాడుగా
By: Tupaki Desk | 3 April 2017 5:44 PM GMTముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ అంతే స్థాయిలో పేజ్3 కార్యక్రమాల్లో పాల్గొనే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రానురాను హాట్ సెలబ్రిటీగా మారిపోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఏ ప్రత్యేక కార్యక్రమమైన కేటీఆర్ ప్రారంభిస్తే లేదా హాజరు అయితే అది వార్తల్లో నిలిచే తీరే వేరు. ఇన్నాళ్లు కార్యాలయాలకే పరిమితం అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు కార్ రేసులకు కూడా పాకినట్లుంది. తాజాగా హైదరాబాద్ మీర్‌పేటలోని గుర్రంగూడలో హాస్టన్ గో కర్టింగ్ కార్ రేస్ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. స్వయంగా ఆయన కారు కూడా నడపడం ఆసక్తికరం.
కాగా, సోమవారం ఉదయం నుంచి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. ఉదయం ఖాజాగూడ చిత్రపురి హిల్స్‌లో కైరోస్ గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించారు. అనంతరం నెక్నాంపూర్ చెరువును పరిశీలించారు. స్థానికులతో మాట్లాడిన కేటీఆర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటు నుంచి గుర్రంగూడ చేరుకుని కారు రేసింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలోని తాండూరులో టీఆర్ఎస్ సభ్యత్వంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...``తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోతాయని, ఇటువంటి ఎన్నో అపోహలు కల్పించారు. సంక్షేమ రంగంలో ప్రభుత్వం దూసుకుపోతుంది. ఏడాదికి 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 4 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు వెయ్యి చొప్పున పెన్షన్ అందిస్తున్నాం. ఒంటరి మహిళలకు నెలకు రూ.వెయ్యి జీవన భృతి ఇస్తున్నాం. ఇంట్లో ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం, ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నాం. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లలకు రూ.75వేలు ఇస్తున్నం. గర్బిణీ స్త్రీల అవసరాల కోసం రూ.12వేల ఆర్థిక సాయం చేస్తున్నం. 13 రకాల వస్తువులతో చిన్న పిల్లలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. 40వేల కోట్లు పేదల సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నాం` అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్న ఇంతకాలం గుడ్డి గుర్రాల పండ్లు తోమారా అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి రావాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో కూర్చొని గడ్డం పెంచుకుని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు కట్టకుండా కోర్టుల్లో కేసులు వేస్తూ, అడ్డుపడుతూ రైతుల నోళ్లలో కాంగ్రెస్ మట్టికొడుతోందని మండిపడ్డారు. ``కాంగ్రెస్ హయాంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడేవాళ్లు. ఎరువులు, విత్తనాలు పోలీస్‌స్టేషన్లో పంచాల్సిన పరిస్థితి ఉండేది. రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలబడుతోంది. రైతుల కోసం 9 గంటలు నాణ్యమైన కరెంట్ పగటి పూట ఇస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రైతాంగంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల కోసం రూ.35 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా పశ్చిమ రంగారెడ్డిని సస్యశ్యామలం చేస్తాం.`` అని కేటీఆర్ హామీ ఇచ్చారు.