Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లోకి షర్మిల చేరికపై కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 3 July 2023 9:53 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు (వైటీపీ) వైఎస్ షర్మిల చేరుతున్నారనే వార్తలు కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. షర్మిల చేరిక విషయంలో కర్ణాటక పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు షర్మిల.. డీకే శివకుమార్ ను బెంగళూరులో కలిసి చర్చలు కూడా జరిపారు.
ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, కొలనుకొండ శివాజీ తదితర నేతలు గన్నవరం వచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్ మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పని చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బిడ్డ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం తనకు ఉందని తెలిపారు. కాంగ్రెస్ వాదిగా, వైఎస్ బిడ్డ రావడాన్ని ఆహ్వానిస్తున్నానని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం కోసం తామంతా కృషి చేస్తున్నామని కేవీపీ తెలిపారు. ఇటుక ఇటుక పేర్చుకుంటూ మళ్లీ ఎదుగుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీకి ఇక్కడ పరిస్థితి వివరిస్తామన్నారు. ఆయన ఇచ్చే నిర్మాణాత్మక సూచనలను అమలు చేస్తామని తెలిపారు.
ఏపీ విభజన హామీల భారాలని తమ పార్టీ కూడా మోస్తుందని కేవీపీ తెలిపారు. 2018లో తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు వల్ల కాంగ్రెస్ నష్టపోయిందన్నారు. ఇక నుంచి కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. విభజన హామీలను అమలు చేయడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయన్నారు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి పరిపాలన, అశ్రద్ద వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు.
టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చేసిన నష్టాన్ని ప్రజలు గుర్తించారని కేవీపీ తెలిపారు. కాంగ్రెస్ వల్లే ఏపీ అభివృద్ధి సాధ్యం అని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు. భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుంది అని కేవీపీ ధీమా వ్యక్తం చేశారు.