Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ కొంటా.. డబ్బుల మూటతో రెడీ

By:  Tupaki Desk   |   20 May 2023 4:07 PM GMT
స్టీల్ ప్లాంట్ కొంటా.. డబ్బుల మూటతో రెడీ
X
స్టీల్ ప్లాంట్ లక్షల కోట్ల కర్మాగారం. అయితే అది ఇబ్బందులో ఉంది. అందులో కొన్ని విభాగాలను నడిపేందు కు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగలో కొనసాగించాలని గత రెండేళ్ళుగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ని కారు చౌకగా అమ్మేస్తున్నారు అన్న ప్రచారం కూడా సాగుతున్న వేళ ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్ కే ఏ పాల్ రంగంలోకి దిగిపోయారు.

ఆయన గత కొంతకాలంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీదనే మాట్లాడుతున్నారు. ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో ఉంచమని తాను మోడీకి చెప్పాను అని అంటున్నారు. ఒక రోజు అమరణ దీక్ష కూడా చేసి ప్లాంట్ కార్మికుల కు మద్దతు ప్రకటించారు. అవసరం అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యమకారుల ను అందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళి నరేంద్ర మోడీతో భేటీ వేయిస్తాను అని ఆయన చెబుతున్నారు.

తాజాగా పాల్ సంచలన కామెంట్స్ చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మితే తాను కొంటాను తన దగ్గర డబ్బు కూడా రెడీగా ఉంది అంటూ ఆయన కీలకమైన ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ కి అవసరం అయిన మూలధనం నాలుగు వేల కోట్ల రూపాయలు తాను ఇస్తానంటూ పాల్ ధీమాగా గట్టి మాట చెప్పారు.

తాను ఈ డబ్బుని అమెరికా వెళ్ళి సేకరించానని, స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తే డెబ్బై రెండు గంటలలో వైట్ మనీ కిందనే చెల్లిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నాలుగు వేల మూలధనం సొమ్ము కనుక ఇస్తే స్టీల్ ప్లాంట్ మూడవ దశను నడపవచ్చునని, ఇది పదహారు వేల మంది స్టీల్ ప్లాంట్ కార్మికులకు శుభ వార్త అని ఆయన చెబుతున్నారు.

మొత్తానికి పాల్ మాటల మనిషిని కాదు అంటున్నారు. కేంద్రానికే ఆయన సవాల్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మహా గొప్ప నాయకులు అంతా కూడా స్టీల్ ప్లాంట్ ని కేంద్రం కాపాడాలని, నడపాలని కోరారు తప్ప తమ వంతుగా వారు చేసింది లేదు, పైగా నిధుల సమీకరణ విషయంలో ఎవరూ ముందుకు రాలేదు, కానీ పాల్ మాత్రం నాలుగు వేల కోట్ల వైట్ మనీని తీసుకుని వస్తామని చెబుతున్నారు.

మీకు ఆ మొత్తం ఇస్తాను ప్లాంట్ ని నడపండి, ప్రైవేట్ పరం చేయాద్దు అని అంటున్నారు. ఈ సవాల్ ని పాల్ మాటలను కేంద్రం పట్టించుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే పాల్ మాత్రం స్టీల్ ప్లాంట్ కోసం మిగిలిన నాయకులు అందరి కంటే కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అని భావించాల్సి ఉంది. అదే టైం లో పాల్ కి స్టీల్ ప్లాంట్ కార్మికుల నుంచి మద్దతు బాగానే దక్కే అవకాశాలు ఉన్నాయి. నాలుగు వేల కోట్లను వైట్ మనీ తెచ్చాను అంటున్న పాల్ ఒక విధంగా మొనగాడుగానే కనిపిస్తున్నారు. మరి దీని మీద కేంద్రం ఏమి ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది.