Begin typing your search above and press return to search.
టీడీపీకి కన్నా టెన్షన్!
By: Tupaki Desk | 17 March 2023 8:00 PM GMTబీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎట్టకేలకు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. కన్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి సీటును ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ సీటును నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నారు. వీరిలో టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, తెలుగు యువత నేత మల్లి, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం వంటివారు ఉన్నారు.
అయితే కన్నా లక్ష్మీనారాయణ దృష్టి ప్రస్తుతానికి సత్తెనపల్లిపైన ఉన్నా ఆయన పరిశీలనలో గుంటూరు పశ్చిమ, పెదకూరపాడు నియోజకవర్గాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే పెదకూరపాడు నుంచే కన్నా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా పెదకూరపాడు నుంచి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనవిజయాలు సాధించారు. ఇక 2009లో గుంటూరు పశ్చిమకు మారిన కన్నా అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
వరుసగా ఐదుసార్లు గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన రికార్డును దక్కించుకున్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కన్నా లక్ష్మీనారాయణ వివి«ద శాఖలకు మంత్రిగా ఉన్నారు.
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కన్నా పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి.. ఈ మూడింటిలో ఏదో ఒక చోట పోటీ చేయడం ఖాయం. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని టాక్ నడుస్తోంది.
గుంటూరు పశ్చిమలో కోవెలమూడి రవీంద్రబాబు టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థి ఈయనే. ఆ ఎన్నికల్లో భారీగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాలని రవీంద్ర సిద్ధంగా ఉన్నారు.
ఇక పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్ గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014ల్లో గెలిచిన శ్రీధర్ 2019లో ఓడిపోయారు. 2024లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి పోటీ చేస్తే శ్రీధర్ కు సీటు కష్టమే.
చంద్రబాబు ఈ మూడు సీట్లలో కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేసినా సీటు ఇవ్వడం ఖాయమే. ఎందుకంటే గుంటూరు పశ్చిమ, పెదకూరపాడుల్లో గతంలో కన్నా గెలిచి ఉన్నారు. సత్తెనపల్లిలో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. కన్నా కూడా కాపులే.
ఈ నేపథ్యంలో కన్నా ఎక్కడి నుంచి పోటీ చేసినా అక్కడ ఇప్పటికే సీట్లు ఆశిస్తున్న టీడీపీ నేతలు సీటుపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. దీంతో వారంతా కన్నా తమ నియోజకవర్గాల పోటీ చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారని టాక్ నడుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.