Begin typing your search above and press return to search.

గగన వీధుల్లో, సముద్రపు లోతుల్లో...విహరించిన తోలి మహిళ !

By:  Tupaki Desk   |   12 Jun 2020 1:30 AM GMT
గగన వీధుల్లో, సముద్రపు లోతుల్లో...విహరించిన తోలి మహిళ !
X
క్యాథరీన్‌ సలవీన్ ..ఈ పేరుకి ఓ చరిత్ర ఉంది.1984 అక్టోబర్‌ 11 గగనం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ తోలి అమెరికా మహిళ ...డు కడలి ‘అడుగు’ను తాకివచ్చిన తొలి సాగరికగా నిలిచింది. భూమి పుట్టి , జ్ఞానం పెరిగిన తరువాత ఏ మహిళా వెళ్లని జలధి అగాధంలోకి వెళ్లి విజేతగా తిరిగి వచ్చారు క్యాథరీన్‌ సలవీన్. ఆమె ఎవరికైనా చేప్పే ఒకే ఒక మాట.. 'మనల్ని బాగు చేయనివ్వొద్దు.. పాడు చేయనివ్వొద్దు..’. ముప్పై ఏడేళ్ల క్రితమే అంతరిక్షంలో నడిచిన ఈ తొలి అమెరికన్‌ మహిళ ఇప్పుడు సముద్ర గర్భంలోని ‘ఛాలెంజర్‌ డీప్‌’ వరకు వెళ్లిన తొలి ప్రపంచ మహిళ అయ్యారు. జూన్‌ 7 ఆదివారం క్యాథరీన్‌ ఈ ఘనతను సాధించారు.

నింగిపైన భూకక్ష్య చుట్టూ తిరుగుతుండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రూట్‌ మ్యాప్‌ ను చూసుకుంటూ సముద్రం లోపలికి 35 వేల అడుగుల గమ్యస్థానానికి చేరుకోవడం అంటే మత్స్యయంత్రాన్ని కొట్టడమే..కాని , అలాంటి సాహసాన్ని ఈమె ఎంతో సునాయాసంగా పూర్తిచేయగలిగింది. ' ఛాలెంజర్‌ డీప్‌’ అనేది మారియానా అగాధంలో ఉండే ఒక సముద్ర కేంద్రం. అక్కడికి లిమిటింగ్‌ ఫ్యాక్టర్ అనే జలాంతర్నౌకలో చేరుకున్నారు క్యాథరీన్‌. అంత లోతులో నీటి పీడనం సముద్ర ఉపరితలం మీద ఉండేదాని కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి చాలు బలంగా లేని జలాంతర్నౌక పేలిపోడానికి.

ఇదే ప్రమాదం మనిషి వేసుకున్న రక్షణ కవచానికీ ఉంటుంది. ఇక పీడనం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉంటే శిఖరస్థాయి. లేకుంటే పాతాళం. సూక్ష్మక్రిములు మాత్రమే తట్టుకుని జీవించగల అస్థిరతలు అవి. పైగా చీకటి. క్యాథరీన్‌ సముద్ర విజ్ఞాన పరిశోధకురాలు కనుక తేలిగ్గా ఈదుకొచ్చేశారు. నాసా వ్యోమగామి కూడా అయిన క్యాథరీన్‌ గగన– సాగర అనుభవం జలాంతర్నౌక పైలట్‌ విక్టర్‌ వెస్కోవో పనిని సులభతరం చేసింది.

మారియానా అగాధం పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలోని మారియానా దీవులకు తూర్పు వైపున ఉంటుంది. మొత్తం భూగోళం మీదే అతి లోతైన సముద్ర గర్భం అది. లోపల 11 వేల మీటర్ల కింద ఉండే ప్రదేశమే.. ’ఛాలెంజర్‌ డీప్‌’. అక్కడికి చేరుకున్నారు క్యాథరీన్‌. ఇంతవరకు మహిళలెవరూ సాధించని విజయాన్ని ప్రపంచ మహిళావనికి సంపాదించి పెట్టారామె. ఇదంతా ఆమె అధ్యయంలో ఒక భాగం. క్యాథరీన్‌ అట్లాంటిక్‌ మహా సముద్రం పైన కూడా సాహసయాత్రలు చేశారు. భూగర్భశాస్త్రంలో పీహెచ్ ‌డీ చేశారు క్యాథరీన్‌. ‘యు.ఎస్‌.నేవల్‌ రిజర్వు లో ఓషనోగ్రఫీ ఆఫీసర్‌గా పని చేశారు. తర్వాత ‘నాసా’కు వెళ్లిపోయారు. భూమి, సముద్రం, ఆకాశం! ‘నాసా’లో పదిహేనేళ్లు పరిశోధనలు చేసి రిటైర్‌ అయ్యాక అమెరికా ప్రభుత్వ సముద్ర వాణిజ్య, వాతావరణ శాఖ సలహాదారుగా పని చేశారు. కొత్త అధ్యక్షుడిగా ట్రంప్‌ రావడంతో ఆ పదవి వేరే వారితో భర్తీ అయింది. 37 ఏళ్ల క్రితం ముప్పై ఒక్కేళ్ల వయసులో తను చేసిన ‘స్పేస్‌ వాక్‌’కి గగన సోపానాలను నిర్మించకున్నదీ, ఇప్పుడీ 68 ఏళ్ల వయసులో సముద్రగర్భంలో తను వదలి వచ్చిన ‘అడుగు’ జాడలకు దారులు నిర్మించుకున్నది పూర్తిగా తనే.