Begin typing your search above and press return to search.
కెనడాలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ కాల్చివేత!
By: Tupaki Desk | 19 Jun 2023 1:25 PM GMTభారత మోస్ట్ వాంటెడ్ జాబితా లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ ను కెనడా లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఇద్దరు గుర్తుతెలియని యువకులు గురుద్వారా సాహిబ్ ప్రాంగణం లోకి ప్రవేశించి ఈ దాడికి పాల్పడ్డారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాల కు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్.ఐ.ఏ. పలు కేసులు మోపింది. అదేవిధంగా ఇతడి పై క్యాష్ రివార్డు కూడా ఉంది.
పంజాబ్ రాష్ట్రం లో కూడా పలుకేసులు ఉన్న హిర్ దీప్ సింగ్.. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యుల కు.. కార్యకలాపాల నిర్వహణ, నెట్ వర్క్ ఏర్పాటు చేయడం, ఆర్థిక సహకారం అందించండం వంటివి హర్ దీప్ చేస్తుంటాడు. ఇతనికి "సిక్ ఫర్ జస్టిస్" సంస్థతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదే సమయం లో ఇటీవల ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ లో కూడా ఇతడి హస్తం ఉందని తెలిసింది.
గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ఉన్న సమయంలో కెనడా కు అప్పగించిన మోస్ట్ వాంటెడ్ జాబితా లో ఇతడి పేరు ను కూడా చేర్చారు. 2018లో ఈ జాబితా ను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కు అప్పగించారు. ఇదే సమయంలో సోషల్ మీడియా లో ఇతనికి సంబంధించిన విద్వేషపూరిత ప్రసంగాలు హల్ చల్ చేస్తూ ఉంటాయని తెలుస్తుంది!
పంజాబ్ రాష్ట్రంలో పలు కేసులు కలిగి ఉన్న హర్ దీప్ సింగ్ పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 40 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితా లో నిజ్జార్ పేరు కూడా ఉంది. ఆయన్ను పట్టించిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి కూడా కేంద్రం ప్రకటించింది.
కాగా, పంజాబ్ రాష్ట్రం జలంధర్ లోని బహర్ సింగ్ పుర గ్రామానికి చెందిన ఈ హర్దీప్ సింగ్ కి చెందిన భూమిని పంజాబ్ ప్రభుత్వం గతం లోనే సీజ్ చేసింది. అయితే ప్రస్తుతం ఇతడి కుటుంబసభ్యులు ఎవరూ స్వగ్రామంలో లేరు!