Begin typing your search above and press return to search.

కిమ్​ కంట కన్నీరు..ఆశ్చర్యం..దాని వెనకాల అంతరార్థం అదే!

By:  Tupaki Desk   |   12 Oct 2020 4:45 AM GMT
కిమ్​ కంట కన్నీరు..ఆశ్చర్యం..దాని వెనకాల అంతరార్థం అదే!
X
అత్యంత క్రూరుడు, నియంతగా పేరున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు - కిమ్​ జంగ్ ఉన్​ తొలిసారి ఓ బహిరంగ సభలో కన్నీరు పెట్టుకున్నాడు. నిజానికి కిమ్​ ఎప్పుడూ తన భావోద్వేగాన్ని బయటపడనీయడు. చాలా గంభీరంగా - రెచ్చగొట్టే ధోరణిలో ప్రసంగిస్తుంటాడు. అటువంటి కిమ్​ ఏడ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతడి ఏడుపు వెనుక చాలా అంతరార్థం ఉందంటూ మీడియా బాష్యాలు చెబతున్నది. కిమ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో. ఏ వ్యూహంతో ముందుకెళ్తాడో కాకలు తీరిని మానసిక శాస్త్రవేత్తలకు సైతం అంతుపట్టదు. అటువంటి వ్యక్తి ఉత్తరకొరియాలోని అధికార వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా 75వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు పెట్టుకున్నారు. దేశం ఎదుర్కొంటున్న కష్టాలను - సైన్యం చూపిన ప్రతిభాపాటవాలను చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా-ఉత్తర కొరియా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కిమ్​ నిరంతరం అణుపరీక్షలు నిర్వహిస్తూ అమెరికాను తీవ్రంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కరోనా సంక్షోభం - ఇతరత్రా కారణాలతో ప్రస్తుతం ఉత్తరకొరియా తీవ్ర ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయింది.

ఈ విషయంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే ప్రజల్లో నెలకొన్ని అసహనాన్ని చల్లార్చడానికి కిమ్​ ఇలా ప్రవర్తించి ఉంటాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శనివారం నిర్వహించిన పరేడ్‌లో భారీ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణుల్ని(ఐసీఎంబీ)లను ఉత్తర కొరియా ఆవిష్కరించింది. ఐసీఎంబీలను ఏకంగా 11 యాక్సిల్‌ ఉన్న భారీ వాహనంపై ప్రదర్శించారు. ఈ క్షిపణి వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అతి పెద్ద ఐసీఎంబీల్లో ఒకటిగా నిలుస్తుందనేది నిపుణుల అంచనా వేస్తున్నారు. అలస్కాలోని అమెరికా రక్షణ వ్యవస్థే లక్ష్యంగా దీనిని రూపొందించారని మిడల్‌ బ్యురే ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌‌కి చెందిన జెఫ్రీ లూయిస్ అన్నారు. పార్టీ వార్షికోత్సంలో కిమ్​ ఏమన్నారంటే.. 'ఉత్తరకొరియా రక్షణవ్యవస్థను మరింత పటిష్ఠంగా నిలబెడతా. అంతర్జాతీయ సంక్షోభం కారణంగా ప్రజలకిచ్చిన కొన్ని హామీలను నెరవేర్చలేకపోయా. అందుకు నేను సిగ్గుపడుతున్నా. కానీ త్వరలోనే మన దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. ఇప్పడు చెప్పినవన్నీ తుచ తప్పకుండా పాటిస్తా. కరోనా సంక్షోభం ముగిసిపోయాక ఉత్తరకొరియా - దక్షిణ కొరియా మధ్య నెలకొన్న సమస్యలన్నీ తొలగిపోవచ్చు’ అని కిమ్ పేర్కొన్నారు.