Begin typing your search above and press return to search.
కింగ్ కోహ్లీ ఐపీఎల్ క్యాచ్ ల్లోనూ టాప్
By: Tupaki Desk | 24 April 2023 2:17 PM GMTటీం ఇండియా స్టార్ క్రికెటర్ అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్స్ లో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో కూడా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారిగా ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేక పోయింది. కానీ వ్యక్తిగతంగా మాత్రం కోహ్లీకి ఎన్నో రికార్డులు దక్కాయి. తాజాగా మరో అరుదైన రికార్డు దక్కింది.
ఐపీఎల్ లో వంద క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ చేరాడు. ఇప్పటికే సురేష్ రైనా 109 క్యాచ్ లతో టాప్ లో ఉండగా.. ఆల్ రౌండర్ పొలార్డ్ 103 క్యాచ్ లతో రెండవ స్థానంలో ఉన్నాడు. తాజాగా 101 క్యాచ్ లతో క్యాచ్ ల సెంచరీ లో విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు.
ఈసారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా విరాట్ కోహ్లీ మరియు ఆయన జట్టు ఆటగాళ్లు దూకుడు మీదున్నారు.
ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అయిదవ స్థానంలో నిలిచింది. ముందు ముందు ఆడబోతున్న మ్యాచ్ లు కోహ్లీ జట్టుకు అత్యంత కీలకం. ఇదే జోరుతో ముందుకు సాగాలని బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు.